Begin typing your search above and press return to search.
ఓవర్ స్పీడ్ నిజమే మద్యం మత్తు... యాక్సిడెంట్ పై నటి స్పందన
By: Tupaki Desk | 27 July 2021 11:30 AM GMTతమిళ నటి కమ్ బిగ్ బాస్ ఫేమ్ యషికా ఆనంద్ మూడు రోజుల క్రితం అర్థ రాత్రి సమయంలో పాండిచ్చేరి నుండి చెన్నైకి పార్టీని ముగించుకుని కారులో వస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. అర్థ రాత్రి సమయంలో జరిగిన ఆ యాక్సిడెంట్ లో యషికా ఆనంద్ స్నేహితురాలు హైదరాబాద్ కు చెందిన భవానీ అక్కడికి అక్కడే మృతి చెందింది. యషికా తో పాటు ఇతర స్నేహితులు గాయాలతో బయట పడ్డారు. యాక్సిడెంట్ కు అతి వేగంగా పోలీసులు నిర్థారణకు వచ్చారు.
యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారును యషికా డ్రైవ్ చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. అంతే కాకుండా ఆమె మద్యం మత్తులో ఉండి ఉంటుందని కూడా అనుమానించారు. ఆమె రెండు రోజుల తర్వాత కాస్త కోలుకుంది. దాంతో వెంటనే ఆమెను పోలీసులు ప్రశ్నించారు. యాక్సిడెంట్ కు సంబంధించిన వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది.
యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారును డ్రైవ్ చేస్తున్నది తానే అంటూ ఒప్ప్పుకున్న యషిక ఆ సమయంలో 120 స్పీడ్ తో వెళ్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే పోలీసులు అనుమానిస్తున్నట్లుగా ఆ సమయంలో మాత్రం మద్యం తాగలేదని పేర్కొంది. మద్యం మత్తులో నేను లేనని.. పూర్తిగా స్పృహలోనే ఉన్నట్లుగా ఆమె పేర్కొంది. తాను సీటు బెల్ట్ ధరించి ఉండటం వల్ల ఎక్కువగా గాయాలు కాలేదు అంటూ చెప్పుకొచ్చింది.
కాని తన స్నేహితురాలు సీటు బెల్ట్ పెట్టుకోలేదని అందుకే ఆమె డివైడర్ ను ఢీ కొట్టిన వెంటనే బయటకు విసిరివేయబడింది అంటూ యషికా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న యషికా డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు కాచుకు కూర్చున్నారు. ఆమె పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా తమిళనాడు పోలీసులు పేర్కొన్నారు.