Begin typing your search above and press return to search.

యశోద ఫస్ట్ డే కలెక్షన్స్.. షాకింగ్!

By:  Tupaki Desk   |   12 Nov 2022 5:30 AM GMT
యశోద ఫస్ట్ డే కలెక్షన్స్.. షాకింగ్!
X
లేడీ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యశోద సినిమా శుక్రవారం సౌత్ ఇండస్ట్రీలో భారీగానే విడుదల అయింది. ఇక హిందీలో కూడా కొన్ని లిమిటెడ్ థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేశారు.

కాస్త మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న యశోద సినిమా ఉదయం షోల కంటే సాయంత్రం నైట్ షోలకు కాస్త ఎక్కువ కలెక్షన్స్ పెంచుకుంది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను హరి హరీష్ అనే దర్శకులు తెరపైకి తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమాకు దాదాపు 40 కోట్ల వరకు బడ్జెట్ అని చెప్పుకున్నారు. కానీ అసలు ఆ రేంజ్ లో అయితే సినిమాలో బడ్జెట్ పెట్టినట్లు కనిపించడం లేదు అని వర్గం వారి నుంచి టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంది అనే వివరాల్లోకి వెళితే.

యశోద సినిమాను తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ మలయాళం భాషల్లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తెలుగులో మొదటి రోజు 3 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇక హిందీలో పది లక్షలు రాబట్టిన ఈ సినిమా తమిళంలో మరో 10 లక్షలు మలయాళం లో తొమ్మిది లక్షల వరకు వసూలు అందుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక అటు ఇటుగా ఈ సినిమా ఇండియాలో 3 కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఓవర్సీస్ లో చూసుకుంటే దాదాపు 80 లక్షలు రాబట్టిన యశోద సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 3.50 కోట్లపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.

తొలి రోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నప్పటికీ కూడా పెట్టిన బడ్జెట్ కు అయితే ఈ లెక్క ఏమాత్రం సరితూగదు. శనివారం ఆదివారం ఈ సినిమా కలెక్షన్స్ ఎంతోకొంత పెరగాల్సిందే. లేకుంటే డిస్ట్రిబ్యూటర్స్ కు తీవ్ర స్థాయిలో నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.