Begin typing your search above and press return to search.
'యశోద' టీజర్: గర్భిణీ స్త్రీగా ఇంటెన్స్ యాక్షన్ తో అదరగొట్టిన సమంత..!
By: Tupaki Desk | 9 Sep 2022 5:37 AM GMTదక్షిణాది అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ''యశోద". ఇది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ యాక్షన్ థ్రిల్లర్. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.
'యశోద' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో ఈరోజు (సెప్టెంబర్ 9) ఉదయం టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ ఇంటెన్స్ టీజర్ ఆకట్టుకుంటోంది.
యశోద అనే గర్భిణీ స్త్రీ పాత్రలో సమంత ను పరిచయం చేయడంతో టీజర్ ప్రారంభం అవుతుంది. ప్రెగ్నెంట్ లేడీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ చెప్తుండగా.. దానికి పూర్తి భిన్నంగా ఆమె లైఫ్ లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
యశోద చుట్టూ ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్లు.. ఆమె బిడ్డకు జన్మనివ్వడకుండా ఎవరో అడ్డుకోడానికి ట్రై చేస్తున్నట్లు టీజర్ లో చూపించారు. వారి నుంచి తనని తాను కాపాడుకోడానికి ఆమె శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
ఇంటెన్స్ యాక్షన్ - ఎమోషనల్ షాట్స్ తో కట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠ భరితంగా థ్రిల్ కు గురి చేసేలా సాగింది. ఇందులో విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కు తగ్గట్టుగా అద్భుతంగా ఉన్నాయి.
గర్భిణీ లేడీగా సమంత ఎప్పటిలాగే అసాధారణమైన నటన కనబరిచింది. యాక్షన్ సీన్స్ లోనూ ఆమె అదరగొట్టింది. ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో కనిపించాడు.
వరలక్ష్మి శరత్ కుమార్ - రావు రమేష్ - మురళీ శర్మ - కల్పిక గణేష్ - సంపత్ రాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. అయితే టీజర్ లో సామ్ - ఉన్ని ముకుందన్ మినహా మిగతా ఎవరినీ చూపించలేదు.
శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకద్వయం హరి & హరీష్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. అశోక్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు.
'యశోద' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటించనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.