Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : యశోద
By: Tupaki Desk | 11 Nov 2022 9:07 AM GMT'యశోద' మూవీ రివ్యూ
నటీనటులు: సమంత-వరలక్ష్మి శరత్ కుమార్-ఉన్ని ముకుందన్-రావు రమేష్-సంపత్-మురళీ శర్మ-శత్రు-కల్పిక గణేష్-దివ్య శ్రీపాద తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సుకుమార్
మాటలు: పులగం చిన్ననారాయణ-చల్లా భాగ్యలక్ష్మి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: హరి-హరీష్
తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న కథానాయికల్లో సమంత ఒకరు. యు టర్న్.. ఓ బేబీ లాంటి చిత్రాలతో మెప్పించిన సామ్.. ఇప్పుడు 'యశోద'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ దర్శకులు హరి-హరీష్ రూపొందించిన ఈ చిత్ర థ్రిల్లర్ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
యశోద (సమంత) ఒక మధ్య తరగతి అమ్మాయి. డబ్బుల కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి సిద్ధ పడ్డ ఆమె ఒక పెద్ద సంస్థతో కాంట్రాక్టు కుదుర్చుకుని గర్భం దాల్చిన దగ్గర్నుంచి డెలివరీ వరకు ఒక రహస్య ప్రాంతంలోని భవనంలో ఉండేందుకు వెళ్తుంది. అక్కడ ఆమెకు వింత అనుభవాలు ఎదురవుతాయి. అక్కడ ఏదో తేడా జరుగుతోందని ఆమెకు అర్థం అవుతుంది. డెలివరీకి సిద్ధమైన మహిళలు ఒక్కొక్కరుగా అంతర్ధానం అవుతుండటంతో దీని వెనుక ఏదో కుట్ర ఉందని యశోద పసిగడుతుంది. ఇంతకీ ఆ మిస్టరీ ఏంటి.. దాన్ని ఛేదించడానికి ఆమె ఏం చేసింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
తారకరత్న విలన్ పాత్రలో.. భూమిక లీడ్ రోల్ చేసిన రవిబాబు సినిమా 'అమరావతి' గుర్తుందా? అంతకుముందు రవిబాబు తీసిన 'అనసూయ' తరహాలోనే ఒక విభిన్నమైన కథాంశంతో ఉత్కంఠ రేకెత్తించే కథనంతో 'అమరావతి' ఆసక్తికరంగానే సాగుతుంది. కాకపోతే అందులో గర్భం దాల్చిన మహిళలు.. వారిని ఎటాక్ చేసే విలన్ చుట్టూ తిరిగే మూల కథాంశమే ఏదోలా అనిపిస్తుంది. రవిబాబు చాలా భిన్నంగా ఆలోచిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసేలా ఈ కాన్సెప్ట్ ను డీల్ చేసినప్పటికీ.. 'గర్భం' అనే సున్నితమైన అంశం మీద చాలా హార్డ్ హిట్టింగ్ గా కొన్ని ఎపిసోడ్లను నడిపించడం వల్ల వాటిని జీర్ణించుకోవడం కష్టమవుతుంది. బేసిగ్గా 'అమరావతి' మంచి థ్రిల్లరే అయినా.. అనుకున్నంతగా ఆడకపోవడానికి కారణం జీర్ణించుకోవడం కష్టంగా అనిపించే ప్లాట్ పాయింటే. ఆ అనుభవం తర్వాత ఇప్పుడు తమిళ యువ దర్శకులు హరి-హరీష్.. 'అమరావతి'ని గుర్తుకు తెచ్చే కథాంశంతో చేసిన సాహసమే 'యశోద'. ఇందులోనూ ప్లాట్ పాయింట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇలా కూడా జరుగుతుందా అన్న ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇందులో కూడా గర్భం-బిడ్డ అనే సున్నితమైన అంశాల చుట్టూ హార్డ్ హిట్టింగ్ గా కథను నడపడమే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ప్రేక్షకులను చాలా వరకు గెస్సింగ్ లో ఉంచడంలో.. ఉత్కంఠ రేకెత్తించడంలో.. ఆశ్చర్యపరచడంలో 'యశోద' టీం సక్సెస్ అయినప్పటికీ.. ప్లాట్ పాయింట్ అంత నమ్మశక్యంగా లేకపోవడం.. దాన్ని డీల్ చేసిన విధానం కొంచెం ఎబ్బెట్టుగా ఉండటం మైనస్. ప్లస్సులతో పాటు మైనస్సులు కూడా సమాన స్థాయిలో ఉన్న 'యశోద'ను సూపర్ అనలేం. అలా అని ఇది తీసిపడేసే సినిమా కూడా కాదు.
'యశోద' ఫస్ట్ టీజర్ చూసినపుడే ఇదొక భిన్నమైన ప్రయత్నం.. బలమైన కంటెంట్ ఉన్న సినిమా అని అర్థమవుతుంది. తమిళంలో కొన్ని భిన్నమైన సినిమాలు తీసిన హరి-హరీష్.. 'యశోద' విషయంలోనూ కొత్తగానే ఆలోచించారు. వాళ్లు ఎంచుకున్న పాయింట్.. దాని కోసం చేసిన కసరత్తు విషయంలో అభినందించాలి. కానీ తెరపై దీన్ని కన్విన్సింగ్ గా చూపించే విషయంలో ఈ దర్శక ద్వయం తడబడింది. సెలబ్రెటీలు.. ధనవంతులు సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం చాలా మామూలు వ్యవహారంల ా మారిన రోజులివి. అందులోనూ ఇటీవల నయనతార అద్దె గర్భంతోనే కవలలకు జన్మనివ్వడం.. దాని చుట్టూ పెద్ద చర్చ జరిగిన నేపథ్యంలో హరి-హరీష్ ఎంచుకున్న పాయింట్ కంటెంపరరీగా అనిపిస్తుంది. ఐతే ఈ సరోగసీకి సంబంధించి ఏదైనా కుట్ర కోణాలను రియలిస్టిగ్గా చూపించి షాకిస్తారని అనుకుంటే.. ఒక ఊహాజనితమైన పాయింట్ తో వేరే రకమైన షాక్ తగులుతుంది ప్రేక్షకులకు. ఈ పాయింట్ సినిమాకు బలమే కాదు.. బలహీనత కూడా అని చెప్పాలి. ప్రేక్షకుల ఊహకు అందని విధంగా.. వాళ్లు షాకయ్యేలా ఈ పాయింట్ ఉండడం బలం అయితే.. అది నమ్మశక్యంగా అనిపించకపోవడం.. కొంచెం ఎబ్బెట్టుగా ఉండటం బలహీనత.
థ్రిల్లర్ సినిమాలకు ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం.. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తించడం. ఈ విషయంలో 'యశోద' సినిమా కొంత వరకు బాగానే సక్సెస్ అయింది. అద్దె గర్భంతో పిల్లల్ని కనడానికి మహిళలందరూ ఒక చోటికి చేరడం.. వారిలో ఒక్కొక్కరు అంతర్ధానం అయిపోవడం..ఈ మిస్టరీని ఛేదించడానికి హీరోయన్ చేసే ప్రయత్నాల నేపథ్యంలో కథనం ఒక దశ వరకు ఆసక్తికరంగానే నడుస్తుంది. కామెడీ.. రొమాన్స్ లాంటి అంశాలను కూడా జొప్పించడానికి చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించకపోయినా.. అసలక్కడ ఏం జరుగుతోందనే విషయంలో ప్రేక్షకులను క్యూరియాసిటీ పెంచడంలో దర్శకులు విజయవంతం అయ్యారు. మిస్టరీని ఛేదించే దిశగా కథానాయిక చేసే సాహసాలకు సంబంధించి కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నా సరే.. ఆ ఎపిసోడ్లు ఓకే అనిపిస్తాయి. ప్రథమార్ధం వరకు కొంచెం వేగంగానే సాగిపోతుంది.
ఇక ద్వితీయార్ధం ఆరంభమైన కాసేపటికే కథ తాలూకు అసలు గుట్టేంటో తెలిసిపోతుంది. ఇందులో షాక్ ఫ్యాక్టర్ బాగానే వర్కవుట్ అయినప్పటికీ.. తెరపై చూస్తున్నదంతా కృత్రిమంగా అనిపించడంతో మిక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది. అసలు గుట్టు బయటపడిపోయాక.. తర్వాత ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచే అంశాలు లేకపోయాయి ప్రి క్లైమాక్స్ ముందు ట్విస్టు రివీల్ చేసినట్లయితే వ్యవహారం వేరుగా ఉండేది. ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక దాదాపు 40 నిమిషాల కథను నడిపించడం.. అది కొంచెం సాగతీతగా అనిపించడం మైనస్. కథానాయికకు సంబంధించి ట్విస్టు ప్రేక్షకులను ఏమంత ఎగ్జైట్ చేయదు. అది ఎన్నో సినిమాల్లో చూసిందే. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ సాగతీతగా అనిపించి.. సినిమా గ్రాఫ్ ను తగ్గిస్తాయి. కాకపోతే సినిమా ఎక్కడా మరీ బోరింగ్ గా అనిపించకపోవడం ప్లస్. ఓవరాల్ గా చూస్తే 'యశోద' డిఫరెంట్ థ్రిల్లర్లు చూడాలనుకునేవారు ఒకసారి ట్రై చేయదగ్గ సినిమానే. అలా అని ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే కష్టం.
నటీనటులు:
యశోద పాత్రను అందరు హీరోయిన్లూ చేయలేరు. ఈ పాత్రను తెరపై చూస్తున్నపుడు అనుష్క, సమంత లాంటి అతి కొద్దిమందే చేయగలరు అనిపిస్తుంది. సినిమాను పూర్తిగా తన భుజాల మీద సమంత మోసిందనే చెప్పాలి. పాత్ర తాలూకు డిఫరెంట్ షేడ్స్ ను ఆమె బాగా చూపించగలిగింది. యాక్షన్ ఘట్టాలు చూస్తే సామ్ మాత్రమే ఇలాంటివి చేయగలదు అనిపిస్తుంది. ఫిట్నెస్ ఫ్రీక్ గా తనకున్న ఇమేజ్ ఆ సన్నివేశాలకు ఉపయోగపడింది. ఎమోషనల్ సీన్లలో కూడా సామ్ బాగా చేసింది. ముందు అమాయకంగా కనిపించి.. ఆ తర్వాత రూపం మార్చుకునే పాత్రలో ఉన్ని ముకుందన్ ఆకట్టుకున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నెగెటివ్ రోల్ లో ఆకట్టుకుంది. రావు రమేష్ తక్కువ సీన్లలోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన పాత్ర కొంత వరకు 'పక్కా కమర్షియల్' సినిమాను గుర్తుకు తెస్తుంది. సంపత్.. శత్రు.. కల్పిక గణేష్.. దివ్య శ్రీపాద్.. వీళ్లంతా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.
సాంకేతిక వర్గం:
మణిశర్మ నేపథ్య సంగీతం 'యశోద'కు ఎసెట్. కథాకథనాల్లో ఇంటెన్సిటీని చూపించడంలో మణిశర్మ బీజీఎం కీలక పాత్ర పోషించింది. కొన్ని సన్నివేశాలను ఉత్కంఠభరితంగా మార్చడంలో మణిశర్మ తన నైపుణ్యాన్ని చూపించాడు. సినిమాలోని ఒకట్రెండు బిట్ సాంగ్స్ ఏమంత ఆకట్టుకునేలా లేవు. సుకుమార్ ఛాయాగ్రహణం బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ ఓకే. సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టారు. కాకపోతే ఆర్ట్ వర్క్ కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది. పులగం చిన్ననారాయణ-చల్లా భాగ్యలక్ష్మిల మాటలు షార్ప్ గా ఉన్నాయి. అతి లేకుండా సన్నివేశాలకు అవసరమైనంత మేర మాటలు రాశారు. ఇక దర్శకులు హరి-హరీష్ ఒక భిన్నమైన పాయింట్ తీసుకుని ఒక ఊహాజనితమైన కథతో సినిమాను నడపించడానికి కసరత్తు చేశారు. వాళ్లెంత కష్టపడ్డా కానీ.. ప్లాట్ పాయింట్ ను కన్విన్సింగ్ గా తెరపై ప్రెజెంట్ చేయలేకపోయారు. 'యశోద'ను పకడ్బందీ థ్రిల్లర్ గా తీర్చిదిద్దేందుకు వాళ్లు చేసిన ప్రయత్నం సగంలో ఆగిపోయిందనిపిస్తుంది.
చివరగా: యశోద.. కొత్త కథలో కొన్ని మెరుపులు కొన్ని మరకలు
రేటింగ్-2.5/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater