Begin typing your search above and press return to search.

ఫైటర్ సమంతకి ఇదో పెద్ద లెక్కా..?

By:  Tupaki Desk   |   2 Nov 2022 2:30 AM GMT
ఫైటర్ సమంతకి ఇదో పెద్ద లెక్కా..?
X
స్టార్ స్టేటస్ రావడం కోసం ఒక్కొక్కరు ఒక్కోలా కష్టపడతారు. అయితే వచ్చిన ఆ స్టార్ ఇమేజ్ ని కాపాడుకునేందుకు మాత్రం చాలా తక్కువ మంది పోరాడుతారు. అలాంటి వారిలో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఒకరు. ఏ మాయ చేసావె సినిమా నుంచి తెలుగు ఆడియన్స్ ని మాయ చేస్తూనే వస్తుంది సమంత. మధ్యలో అక్కినేని ఇంటి కోడలిగా వెళ్లి ఆ తర్వాత డైవర్స్ తీసుకోవడం ఇదంతా ఆమె కెరియర్ కు చాలా ప్రమాదకరంగా మారినా తన ప్రతిభతో మళ్లీ అవకాశాలు అందుకుంటుంది సమంత.

అయితే పోరాడే వాడికే ఎక్కువ బాధలు అన్నట్టుగా కెరియర్ లో మళ్లీ మునుపటి ఫాంలోకి రావాలని ప్రయత్నిస్తున్న సమంతకి మరో బిగ్ షాక్ తగిలింది. అదే తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి. రెగ్యులర్ గా వర్క్ అవుట్స్ చేస్తూ ఉండే సమంతకి ఇలాంటి వ్యాధి రావడం అందరిని షాక్ అయ్యేలా చేసింది. రియల్ లైఫ్ లో ఇన్ని ఇబ్బందులు పడుతున్న సమంత రీల్ లైఫ్ లో రిస్క్ ఎందుకు చేయదు చెప్పండి. ప్రస్తుతం సమంత నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా లో సమంత చేసిన యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

సమంత ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం చాలా కష్టపడ్డది. సమంత ది ఫైటర్ అని ఊరకనే అనడం కాదు ఆమె స్క్రీన్ అవతల పడుతున్న కష్టాన్ని చూస్తే ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఎన్ని కష్టాలు వచ్చినా తను మాత్రం తగ్గేదేలే అన్నట్టు దూసుకెళ్తుంది సమంత. ప్రస్తుతం సమంత యశోద నుంచి యాక్షన్ సీన్స్ వీడియో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఈ యాక్షన్ సీన్స్ ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ యానిక్ బెన్ కంపోజ్ చేశారు.

యశోద యాక్షన్ మేకింగ్ వీడియో చూసిన ఆడియన్స్ సమంత డెడికేషన్స్ కి ఫిదా అవుతున్నారు. అయినా ఫైటర్ సమంత రియల్ లైఫ్ లోనే ఎన్నో రిస్క్ లని ఫేస్ చేస్తుంది. రీల్ లైఫ్ అది కూడా ఆడియన్స్ ని మెప్పించడం కోసం ఈ మాత్రం కష్టపడం ఆమెకి ఒక లెక్కా అని సమంత ఫ్యాన్స్ అంటున్నారు. యశోద మూవీని హరి-హరీష్ దర్శక ద్వయం డైరెక్ట్ చేశారు. ఈ థ్రిల్లర్ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.