Begin typing your search above and press return to search.
యాత్ర-2: వైఎస్ జగన్ పాత్రలో బాలీవుడ్ నటుడు..!
By: Tupaki Desk | 2 July 2021 5:41 AM GMTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని 'యాత్ర' అనే సినిమా రూపొందించారు డైరెక్టర్ మహి వి.రాఘవ్. తెలుగు ప్రజలకు మరోసారి వైఎస్సార్ ను గుర్తు చేసిన రాఘవ్.. అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో 'యాత్ర 2' కూడా తీస్తానని దర్శకుడు అప్పట్లోనే ప్రకటించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో ''యాత్ర 2'' సినిమాను తెరకెక్కిస్తానని.. వైఎస్ రాజా రెడ్డి - జగన్ గురించి చెప్పకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ పూర్తి కాదని యాత్ర డైరెక్టర్ వెల్లడించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బియోపిక్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అప్పటి నుంచే అందరిలో ఆసక్తి పెరిగింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటిస్తారనే దాని గురించి చర్చలు మొదలయ్యాయి.
'యాత్ర' సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి జీవించారనే చెప్పాలి. ఈ క్రమంలో సీక్వెల్ లో జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తారని వార్తలు వచ్చాయి. అలానే ఆల్రెడీ జగన్ పాత్రను పోషించిన తమిళ నటుడు అజ్మల్ ని కూడా పరిశీలిస్తున్నారని టాక్ వచ్చింది. అయితే మహి వి.రాఘవ్ జగన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
'స్కామ్ 1992' వెబ్ సిరీస్ తో ప్రతీక్ గాంధీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జగన్ పోలికలకు దగ్గరగా ఉండటంతో పాటుగా హావభావాలు కూడా పలికించగలడని ప్రతీక్ గాంధీ ని రాఘవ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జగన్ బయోపిక్ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుందని.. ప్రతీక్ గాంధీ ని తీసుకుంటే పాన్ ఇండియా స్థాయిలో చెప్పొచ్చని దర్శకుడు భావించారట. స్క్రిప్ట్ వినగానే థ్రిల్ కు గురైన ప్రతీక్.. వెంటనే జగన్ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
'యాత్ర' సినిమా క్లైమాక్స్ లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో పాటుగా రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబంధించిన విజువల్స్ చూపించి ఎండ్ చేశారు. 'యాత్ర 2' చిత్రంలో వైఎస్సార్ మరణం నుంచి మొదలుపెట్టి.. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రతో చారిత్రక విజయం సాధించి సీఎం అయ్యేవరకు జరిగిన పరిణామాలను చూపించనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ ఎదుర్కొన్న కష్టనష్టాలు.. వైఎస్ జగన్ పై కేసులు పెట్టి జైలుకు పంపించడం.. సొంతంగా పార్టీ పెట్టి పోరాడటం వంటివి ఇందులో ప్రస్తావించనున్నారు. మహి వి రాఘవ్ పాన్ ఇండియా స్థాయిలో తలపెట్టిన జగన్ బయోపిక్.. ఎలాంటి సంచనాలు సృష్టించబోతుందో చూడాలి.