Begin typing your search above and press return to search.
మేము కమ్మ కానీ.. మేము వైస్సార్సీపీ!
By: Tupaki Desk | 1 Feb 2019 6:11 PM GMTవైయస్సార్ జీవితంలో పాదయాత్ర ఘట్టాన్ని `యాత్ర` పేరుతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న రిలీజవుతోంది. నేటి సాయంత్రం హైదరాబాద్ ఎన్-కన్వెన్షన్ హాల్ లో `యాత్ర` ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, పెంచల్ దాస్, మహి.వి.రాఘవ్, విజయ్.చిల్లా, విజయమ్మ పాత్రధారి ఆశ్రిత తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకకు వైయస్సార్ అభిమానులు భారీగా తరలి వచ్చారు.
వైయస్సార్ వల్ల లబ్ధి పొందిన పలువురు అభిమానులు విచ్చేసి వైదికపైనే ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం ప్రధానంగా చర్చకొచ్చింది. యాత్ర వేదికపై పెద్దాయన్ని తలుచుకుని అసిస్టెంట్ డైరెక్టర్ కన్నీరు మున్నీరు అయ్యారు. ఓ వికలాంగుడు తనకు వైయస్ వల్ల అందిన సాయం గురించి చెప్పారు. వైయస్సార్ జోహార్ అంటూ నినదించారు. ఇక ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో యూట్యూబ్ లైవ్ కామెంట్లలో వైయస్ పై అభిమానులు ఎంతో ఎమోషనల్ అయ్యి వ్యాఖ్యానాల్ని జోడించారు.
ఓవైపు యాత్ర ఈవెంట్ జరుగుతోంది. మరోవైపు లోకేష్ మలినేని అనే ఓ వీరాభిమాని .. లైవ్ కామెంట్లలో తన ఎమోషన్ ని ఇలా తెలియజేశాడు. ``మా తమ్ముడు ఇంజనీర్ అయ్యాడు .. మా చిన్న నాన్న గుండె ఆపరేషన్ అయింది .. మేము కమ్మ కానీ మేము వైస్సార్సీపీ .. అనుభవించి ఋణం తీర్చుకోకుంటే పురుగులు పడి పోతాం అన్నాడు మా నాన్న`` అంటూ తన అభిమానాన్ని తెలియజేశాడు. టోపి సాహెబ్ అనే మరో అభిమాని లైవ్ కామెంట్ లో ..``నాకు 2012 లో ఆక్సిడెంట్ అయింది.. నాకు ఆరోగ్య శ్రీ కింద ఫ్రీగా వైద్యం చేశారు. అందుకే దేవుడు అయ్యారు వైయస్సార్`` అంటూ వ్యాఖ్యానించారు. దేవుడు చేసిన మనిషి.. మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైయస్సార్ అని పలువురు అభిమానులు వ్యాఖ్యానించారు. వైయస్సార్ సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో ఆదుకున్నాయో అర్థమయ్యేలా చెప్పే కామెంట్లు ఇవి. దీనిని బట్టి `యాత్ర` చిత్రం కోసం వైయస్ అభిమానులు ఏ స్థాయిలో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది. ఈవెంట్ ఆద్యంతం ఊహాతీతం అనిపించే ఎమోషన్ కట్టి పడేసింది.