Begin typing your search above and press return to search.
యాత్ర క్లోజింగ్ కలెక్షన్స్
By: Tupaki Desk | 1 March 2019 4:21 AM GMTదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం `యాత్ర`. మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహించారు. విజయ్ చిల్లా - శశిదేవిరెడ్డి నిర్మాతలు. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి యునానిమస్ గా ప్రశంసలు దక్కాయి. అయితే ప్రశంసలు వేరు.. బాక్సాఫీస్ రిజల్ట్ వేరుగా ఉండడం షాకిస్తోంది. అసలింతకీ యాత్ర హిట్టా ఫట్టా? వాస్తవ రిపోర్ట్ ఏంటి? అన్నది పరిశీలిస్తే ఆసక్తికర సంగతులే తెలిసాయి.
ఎన్టీఆర్ కథానాయకుడు - మహానాయకుడు డిజాస్టర్ రిజల్ట్ అందుకున్న నేపథ్యంలో యాత్ర రిపోర్ట్ ఏంటి? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇరువురు గొప్ప నాయకుల పై తెరకెక్కించిన బయోపిక్ లు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయి? అన్న ముచ్చటా జనంలో వేడెక్కిస్తోంది.
యాత్ర చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13కోట్ల మేర బిజినెస్ చేసింది. అయితే ఈ సినిమాని పరిమిత బడ్జెట్ తో తెరకెక్కించడం ఓ రకంగా ప్లస్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే క్లోజింగ్ కలెక్షన్స్ సమాచారం అందింది. యాత్ర ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్యంగా 8.81 కోట్లు వసూలు చేసింది. ఏరియాల వైజ్ షేర్ వసూళ్ల వివరాలు పరిశీలిస్తే...
నైజాం -1.55 - సీడెడ్-1.61 - నెల్లూరు-0.41 - కృష్ణా-0.61 - గుంటూరు-1.12 - వైజాగ్- 0.57 - తూ.గో జిల్లా- 0.32 - ప.గో జిల్లా- 0.42 - ఆంధ్రా - నైజాం కలుపుకుని రూ.6.61 కోట్ల షేర్ వసూలైంది. కేరళ -0.70 - అమెరికా- 0.95 - ఇతర చోట్ల నుంచి 0.55 లక్షలు వసూలైంది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ.8.81 కోట్ల షేర్ దక్కింది. ఇక ఈ సినిమాకి డిజిటల్ రైట్స్ - శాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాతలకు భారీగానే లాభం చేకూరిందని తెలుస్తోంది. సినిమా హిట్టా ఫట్టా అన్నది నిర్మాతకు వచ్చిన లాభాల దృష్ట్యా కాకుండా పంపిణీదారులకు వచ్చిన రిటర్న్స్ ఆధారంగా చూడాల్సి ఉంటుంది. 13 కోట్ల బిజినెస్ అంటే 13 కోట్ల షేర్ మినిమం రావాల్సిందే. ఆ లెక్కన చూస్తే ఇంకా 4కోట్లు లాస్ కిందే లెక్క. ఆ మేరకు పంచ్ పంపిణీదారులు - బయ్యర్లకు పడుతుంది. యాత్ర హిట్టా .. కాదా? అన్నది ఇక మీరే విజ్ఞతతో తెలుసుకోవచ్చు.