Begin typing your search above and press return to search.
వైఎస్ టీజర్ అదిరిపోయిందిగా..
By: Tupaki Desk | 7 July 2018 6:31 PM GMTఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాలపై తిరుగులేని ముద్ర వేసిన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ ఉండగా విమర్శించిన వాళ్లు సైతం ఇప్పుడాయన గొప్పదనాన్ని అంగీకరిస్తారు. ఈ మహానేత జీవితాన్ని వెండి తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు యువ దర్శకుడు మహి.వి.రాఘవ్. వైఎస్ రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన 2003 నాటి పాదయాత్రను హైలైట్ చేస్తూ ‘యాత్ర’ సినిమా తీస్తున్నాడు. ఈ రోజు వైఎస్ జయంతి సందర్భంగా ‘యాత్ర’ టీజర్ వదిలారు. ఇది ఫస్ట్ ఇంప్రెషన్లోనే అమితంగా ఆకట్టుకునేలా ఉంది. వైఎస్ అభిమానులకు విపరీతంగా నచ్చేసే ఈ టీజర్.. రాజకీయాలు పక్కన పెట్టేసి చూస్తే అందరినీ ఆకట్టుకునేలా ఉందనే చెప్పాలి.
‘‘తెలుసుకోవాలనుంది. వినాలనుంది. ఈ కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలనుంది. వాళ్లతో కలిసి నడవాలనుంది. వాళ్ల గుండె చప్పుడు వినాలనుంది. గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. ఈ పాదయాత్ర నా పట్టుదలో మూర్ఖత్వమో చరిత్రనే నిర్ణయించుకోనీ’’ అంటూ పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందు వైఎస్ అంతరాత్మను డైలాగ్ రూపంలో చూపించారు. ఈ డైలాగ్ ఎంత హత్తుకునేలా ఉందో.. విజువల్స్ కూడా అంతే హృద్యంగా ఉన్నాయి. ఒక క్లాసిక్ లుక్ కనిపిస్తోంది టీజర్లో. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేసేలా ఉంది. మమ్ముట్టి సొంత వాయిస్ తోనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. చాలా వరకు ఆయన తేడా రాకుండా బాగానే మేనేజ్ చేయగలిగారు. వైఎస్ గా ఆయన రూపం.. ఆహార్యం బాగానే సెట్టయ్యాయి. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.