Begin typing your search above and press return to search.
టీజర్: 'యాత్ర' ఎమోషనల్
By: Tupaki Desk | 21 Dec 2018 4:14 AM GMTఅవిభాజిత ఆంధ్రప్రదేశ్ లో రైతు కష్టం గురించి చెప్పాల్సిన పనేలేదు. రైతే రాజు అనే స్లోగన్ తో రైతు పుట్టి ముంచే ప్రభుత్వ విధానాలతో ధగాకోరు రాజకీయాలు చేసిన తెలుగు దేశం పార్టీని భూస్థాపితం చేసేందుకు మహానాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కఠోర తపస్సు గురించి తెలిసిందే. రాజశేఖరుడు ప్రత్యర్థిపై నెగ్గి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడానికి కారకుడు రైతు. అందుకే ఆ పాదయాత్ర నేపథ్యంలో `యాత్ర` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అనగానే ప్రజలందరిలో ఒకటే ఉత్కంఠ. మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో 70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజవుతోంది. ఇప్పటికే వైయస్సార్ గా మమ్ముట్టి లుక్ గ్రాండ్ సక్సెసైంది. ఇదివరకూ బయటికి లీకైన అన్ని పోస్టర్లు అభిమానుల్ని ఆకట్టుకున్నాయి.
నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైయస్ అభిమానులకు అద్భుతమైన కానుక అందింది. తాజాగా `యాత్ర` టీజర్ రిలీజైంది. ఈ టీజర్ ఆద్యంతం ఎమోషన్ కట్టిపడేసింది. రైతు కష్టం.. రైతు వెతల్ని ఆవిష్కరించే ఉద్వేగం టీజర్ లో కనిపించింది. ``నీళ్లుంటే కరెంటు ఉండదు.. కరెంటు ఉంటే నీళ్లుండవు.. రెండూ ఉండి పంట చేతికొస్తే సరైన ధర ఉండదు. అందరూ రైతే రాజు అంటారు. సరైన కూడు గుడ్డ నీడ లేని ఈ రాజరికం మాకొద్దయ్యా.. మమ్మల్ని రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బతకనివ్వండి చాలు`` అనే డైలాగ్ తో టీజర్ విలువ పీక్స్ కి చేరిందనే చెప్పాలి.
``నేను విన్నాను .. నేనున్నాను.. `` అంటూ బడుగు రైతును ఓదార్చే సన్నివేశంలో మమ్ముట్టి ఏకంగా ఆ రాజశేఖరుడినే తలపించే ఎక్స్ ప్రెషన్స్ తో మైమరిపించారు. ఈ అద్భుతమైన టీజర్‌ని మరో లెవల్లో ఆవిష్కరించడానికి సంగీతం అంతే గొప్పగా సాయమైంది. `కె` ఈ చిత్రానికి సంగీతం అందించారు. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా- శశిదేవి రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. యాత్రకు సమర శంఖం పూరించి.. ఒక కాలికి కట్టుతోనే వైయస్ యాత్ర ఆరంభించిన విధానాన్ని ఒరిజినాలిటీకి దగ్గరగా యథాతథంగా చూపించారు. పొలంలో రైతు ఆత్మహత్యను హృద్యంగా చూపించారు. జొన్న చేలో వైయస్ ఇంట్రడక్షన్ .. పొలంలో ఎండిన చెట్టుకు వేలాడిన రైతు.. బ్యాక్ గ్రౌండ్ కలరైజేషన్ .. నేపథ్య సంగీతంలో ఎమోషన్ ప్రతిదీ 300 సినిమా నుంచి స్ఫూర్తి పొందారా? అనిపించక మానదు. యాత్ర టీజర్ సక్సెస్. టీజర్ లో ఉన్నంత కిక్కు, ఎమోషన్ సినిమా ఆద్యంతం ఉంటే పెద్ద విజయం సాధించడం ఖాయం. ఫిబ్రవరి 8 వరకూ వేచి చూడాల్సిందే.