Begin typing your search above and press return to search.

ఇయర్ ఎండ్ ధమాకా.. ఒకరోజు ముందు లక్ టెస్ట్..!

By:  Tupaki Desk   |   20 Dec 2022 3:43 AM GMT
ఇయర్ ఎండ్ ధమాకా.. ఒకరోజు ముందు లక్ టెస్ట్..!
X
2022 ఎండింగ్ లో సినిమాల సందడి బాగానే ఉంది. లాస్ట్ ఫ్రైడే అవతార్ 2 రిలీజ్ అవగా వరల్డ్ వైడ్ అవతార్ ఫీవర్ లోనే ఆడియన్స్ అందరు ఉన్నారు. ఇక ఈ ఫ్రైడే మాస్ మహారాజ్ రవితేజ ధమాకా, నిఖిల్ 18 పేజెస్ సినిమాలు వస్తున్నాయి. అయితే వీటితో పాటుగా పోటీగా రెండు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి.

అయితే డిసెంబర్ 23న కాకుండా ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 22న ఆ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వీకెండ్ వచ్చే డబ్బింగ్ సినిమాలు ఏంటి అంటే.. అందులో ఒకటి విశాల్ నటించిన లాఠీ ఉండగా మరొకటి లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన కనెక్ట్ ఉంది.

లాఠి గురించి మాట్లాడుకుంటే తనకున్న తెలుగు మార్కెట్ పై ఇంకాస్త పట్టు సాధించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు విశాల్. ట్రైలర్ తో అంచనాలు పెంచగా.. ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నా లాఠీ మీద ఆశించిన బజ్ అయితే రాలేదు. ఇక నయనతార కనెక్ట్ సినిమా కేవలం 99 నిమిషాల ప్రయోగాత్మక సినిమాగా వస్తుంది. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాని గేమ్ ఓవర్ అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేశారు. ఓటీటీలో హారర్ సినిమాల తాకిడి తెలిసిందే. మరి అలాంటిది కనెక్ట్ తో ఆడియన్స్ ని ఎలా ఎట్రాక్ట్ చేయనున్నారో చూడాలి.

రవితేజ ధమాకా, నిఖిల్ 18 పేజెస్ కి పోటీగా లాఠి, కనెక్ట్ సినిమాలు వస్తున్నాయి. ఓ పక్క అవతార్ 2 కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. డైరెక్ట్ తెలుగు సినిమాల కన్నా ఒకరోజు ముందు రిలీజ్ చేసినా అవతార్ 2 హంగామాకి అవి తట్టుకుంటాయా లేదా అన్నది చూడాలి. ఒకరోజు ముందు లక్ టెస్ట్ చేసుకుంటున్న తమిళ డబ్బింగ్ సినిమాలు ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.

రవితేజ ధమాకా పక్కా మాస్ బొమ్మగా వస్తుంది. మాస్ రాజా ఫ్యాన్స్ ని ఈ సినిమా తప్పకుండా అలరిస్తుందని అనేలా ఉంది. ఇక నిఖిల్ 18 పేజెస్ సినిమాకు సుకుమార్ కథ అందించారు కాబట్టి తప్పకుండా ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ క్రిస్ మస్ విజేతగా ఏ సినిమా నిలుస్తుంది అన్నది తెలియాలంటే ఆ సినిమాలు రిలీజ్ అవ్వాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.