Begin typing your search above and press return to search.

పాటతో దర్శకుడి కొత్త మజిలీ

By:  Tupaki Desk   |   20 March 2019 6:02 AM GMT
పాటతో దర్శకుడి కొత్త మజిలీ
X
దర్శకులే గీత రచయితలుగా మారి పాటలు రాయడం అరుదుగా చూస్తూ ఉంటాం. డైరెక్టర్ గా ఎంత సృజనాత్మకత ఉన్నా అది పదాల్లో పేర్చి ట్యూన్ కి తగ్గట్టు సాహిత్యాన్ని ఇవ్వడం అంత సులభంగా జరిగేది కాదు. అప్పుడెప్పుడో త్రివిక్రమ్ శ్రీనివాస్ రవితేజ సినిమా ఒక రాజు ఒక రాణి కోసం లిరిక్స్ రాసి మళ్ళి ఆ ప్రయత్నం చేయలేదు. కొంచెం వెనక్కు వెళ్తే దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారు ఎంత ఒత్తిడి ఉన్నా సరే తన సినిమాల్లో ఒకటో రెండో లేదా సింగల్ కార్డు పాటలన్ని తనవే ఉండేలా చూసుకున్నారు. అందులో ఎన్నో గొప్ప మరపురాని గీతాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు మజిలీ దర్శకుడు శివ నిర్వాణకు సైతం అలాంటి ఆలోచనే ఉన్నట్టుంది. తాజాగా విడుదలైన మజిలిలోని ఏడు మల్లెలెత్తుకి పాట రాసింది అతనే. ప్రేయసి ప్రియుడి మధ్య ఎడబాటుని అద్భుతంగా ఆవిష్కరించిన పాటగా ఇప్పుడు ఇది మ్యూజిక్ లవర్స్ మనసు దోచుకుంటోంది. ఒకరికి ఒకరు దూరమవ్వడం వల్ల ప్రకృతిలోని జీవజాలం కూడా ఏం కోల్పోతోందో వివరించిన తీరు హత్తుకునేలా ఉంది.

లిరికల్ విజువల్స్ లో చూపించిన దాన్ని బట్టి ఇది కథలో చైతు ఫస్ట్ బ్రేక్ అప్ సందర్భంగా వస్తుంది. మంచి ఫీల్ తో పాటు గోపి సుందర్ విషాదాన్ని ఒలికిస్తూనే మెలోడీగా కంపోజ్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. కాల భైరవ-నిఖిత గాంధీ స్వరాలు బలంగా నిలిచాయి. ఏప్రిల్ 5 రానున్న మజిలీకి ఇవన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ గా పని చేస్తున్నాయి. మనం తర్వాత చైతు సమంతాల కాంబోలో వస్తున్న మూవీగా అభిమానులు మజిలీ మీద గట్టి నమ్మకమే పెట్టుకున్నారు