Begin typing your search above and press return to search.
వీడియో సాంగ్: ఎడబాటులో మజ్ను వేదన
By: Tupaki Desk | 14 Dec 2018 5:33 AM GMTఅక్కినేని నాగార్జున రెండో వారసుడు అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను వచ్చే ఏడాది జనవరి 25 రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఒక టీజర్ తోనే సరిపుచ్చుకున్న టీం ఆడియో హంగామా మొదలుపెట్టెసింది. అందులో భాగంగా విడుదల చేసిన మొదటి ట్రాక్ ఏమైనదో ఏమైనదో యుట్యూబ్ లోకి వచ్చేసింది. ప్రేయసి ఎడబాటును భరించలేని ఓ ప్రియుడి విరహ వేదనను గీత రచయిత శ్రీమణి తన పొందికైన పదాలతో కూర్చిన తీరు ఆకట్టుకునేలా ఉంది. తమన్ ట్యూన్ చాలా కూల్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది.
కాకపోతే ఇదే దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన వరుణ్ తేజ్ తొలిప్రేమ పాట ఛాయలు ఇందులో కూడా వినిపిస్తాయి. గాయకుడు అర్మాన్ మాలిక్ కావడం ఆ ఫీలింగ్ కలగడానికి మరింత దోహదం చేసింది. మొత్తానికి ఆకట్టుకునేలా ఉన్న ఏమైందో ఏమైందో లిరికల్ వీడియోలో అఖిల్ తో పాటు హీరొయిన్ నిధి అగర్వాల్ విజువల్స్ కూడా కొన్ని చూపించడం ఫ్యాన్స్ కి కనువిందే. తమన్ ట్యూనింగ్ స్టైల్ పల్లవి చరణాలకు మధ్యలో వచ్చే మ్యూజిక్ లో ఎక్కువగా బయటపడింది.
కొన్ని బిట్స్ లో ప్రత్యేకమైన శైలి కనపరిచాడు. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న వెంకీ అట్లూరి దీన్ని కూడా ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా రూపొందించినట్టు పాటను బట్టే అర్థమవుతోంది. నాగార్జున మజ్ను పేరుతో ఇరవై ఏళ్ళ క్రితం చేసిన సూపర్ హిట్ మూవీని గుర్తు చేసుకుని ఫ్యాన్స్ ఆ రకంగా కూడా సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి