Begin typing your search above and press return to search.

ఎంత సక్కగున్నావే.. ఇరగ్గొట్టేసిందిగా

By:  Tupaki Desk   |   13 Feb 2018 12:18 PM GMT
ఎంత సక్కగున్నావే.. ఇరగ్గొట్టేసిందిగా
X
దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ మాయ చేశాడు. మామూలు మాయ కాదు... పాట వింటూ పొలాల మధ్యకి వెళ్లిపోయేంత మాయ. పచ్చని గడ్డిలో మెత్తని పాదాలతో నడుచుకెళుతుంటే శరీరానికి వచ్చేంత అందమైన ఫీలింగ్ వస్తుంది అతని పాట వింటే. ఈ పాట చాలు రంగస్థలం సినిమాను నిలబెట్టేయడానికి అనేంతగా ఉంది ‘ఎంత సక్కగున్నావే...’ పాట.

రంగస్థలం 1985 విడుదలవ్వకముందే మనుషులను మాయ చేయడం ప్రారంభించింది. సౌండ్ లెస్ చిట్టిబాబు ఎంట్రీతో... రామలక్ష్మి అందాలనే ఇంతవరకు తలచుకున్న అభిమానులు... ఇప్పుడు ఎంత సక్కగున్నావే పాటకి బిగ్ ఫ్యాన్స్ అయిపోవడం ఖాయం. తన ప్రేయసిని ఊహిస్తూ ఎంత చక్కటి పాట కట్టాడో చిట్టిబాబు. సంగీతమే కాదు... లిరిక్స్ కూడా కట్టిపడేశాయ్. ''ఏరు శెనగ కోసం మట్టిని తవ్వితే... ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే'' అంటూ మొదలయ్యే పాట పల్లెటూరి సామ్ ను అందంగా వర్ణించినట్టు ఉంది. ఈ పాట మొదటి సారి వింటనే డైహార్డ్ ఫ్యాన్స్ అయిపోవడం ఖాయం. సుకుమార్ చాలా తెలివిగా ఒక్కో పాటను విడుదల చేస్తూ అభిమానుల గుండె పిండేశేలా ఉన్నాడు.

ఇకపోతే చాలా రోజుల తరువాత ఇలాంటి కమ్మటి విలేజ్ సాంగ్ ఒకటి వినడం ఆడియన్స్ కు కూడా బాగా నచ్చేస్తోంది. చూద్దాం దేవిశ్రీ ప్రసాద్ రానున్న రోజుల్లో ఇంకెంత మ్యాజిక్ చేయనున్నాడో!!