Begin typing your search above and press return to search.
నిన్న కీర్తి సురేష్ నేడు రాశి ఖన్నా.. సైడ్ బిజినెస్
By: Tupaki Desk | 31 Jan 2022 4:22 AM GMTహీరోయిన్ గా కెరీర్ ఎంత కాలం ఉంటుంది అనే విషయం తెలియదు.. కొందరు స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుని రెండు మూడు సంవత్సరాల్లోనే ఆఫర్లు లేకుండా అయ్యే పరిస్థితి అవుతుంది. ఒకప్పుడు హీరోయిన్స్ గా చేసిన వారు చాలా మంది కనుమరుగయ్యారు. కారణం వారు సినిమాలు మాత్రమే చేసేవారు. కాని ఇప్పుడు హీరోయిన్స్ కు మల్టీపుల్ ఛాయిస్ లు ఉన్నాయి.
హీరోయిన్ గా చేస్తూనే ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.. సోషల్ మీడియాలో అందాల ఫొటో షూట్స్ ను షేర్ చేస్తూ లక్షల మంది ఫాలోవర్స్ ను దక్కించుకుని తద్వారా భారీ ఆదాయంను పొందవచ్చు. ఇక వెబ్ సిరీస్ లు కూడా మంచి అవకాశాలను హీరోయిన్స్ కు ముఖ్యంగా ఫేడ్ ఔట్ అవుతున్న హీరోయిన్స్ కు దక్కుతున్నాయి. ఇక ఈ మద్య కాలంలో హీరోయిన్స్ మరో సైడ్ బిజినెస్ గా యూట్యూబ్ ఛానల్ ను మొదలు పెడుతున్నారు.
చిన్నా చితక వాళ్లే ఎంతో మంది యూట్యూబ్ ను పెట్టి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాంటిది స్టార్స్ యూట్యూబ్ లో ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. స్టార్స్ రెగ్యులర్ లైఫ్ మరియు వారి యొక్క షూటింగ్ విధానం.. వారు ఏం చేస్తున్నారు.. ఎలా చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు ఇలా ప్రతి ఒక్క విషయం గురించి జనాలు తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉంటారు.
హీరోయిన్స్ పర్సనల్ లైఫ్ గురించి చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఉంటారు. అందుకే హీరోయిన్స్ యూట్యూబ్ ఛానల్స్ మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్స్ ను మొదలు పెట్టారు. అందులో అప్పుడప్పుడు వీడియోలు పెట్టినా కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. ఇటీవలే కీర్తి సురేష్ యూట్యూబ్ ఛానల్ ను పెడుతున్నట్లుగా ప్రకటించింది.

ఆమె యూట్యూబ్ ఛానల్ కు మంచి స్పందన వచ్చింది. ఆమె ప్రకటించిన వెంటనే వేల మంది సబ్ స్క్రైబర్స్ అయ్యారు. ఇప్పుడు రాశి ఖన్నా కూడా తాను యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొంది. తన మేకప్ మరియు ఫుడ్ నుండి మొదలుకుని ప్రతి ఒక్క విషయం గురించి యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా తన టీమ్ వీడియో లను షేర్ చేస్తారంటూ చెప్పుకొచ్చింది. యూట్యూబ్ ద్వారా మరింతగా తన అభిమానులకు చేరువ అవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి థ్యాంక్యూ సినిమాలో నటిస్తుంది.
తమిళంలో కూడా రెండు సినిమాలను ఈ అమ్మడు చేస్తుంది. తెలుగు తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు ఈ అమ్మడికి వెబ్ కంటెంట్ లో కూడా ఛాన్స్ వస్తున్నాయట. కాని ఇప్పటి వరకు అధికారికంగా ఈ అమ్మడు ఓకే చెప్పలేదు. ప్రస్తుతానికి సినిమాలపైనే ఈ అమ్మడు పూర్తి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ గా ముందు ముందు మరిన్ని మంచి పెద్ద సినిమాల్లో నటించాలని ఆశ పడుతుందట. ఇదే సమయంలో అభిమానులకు తన వ్యక్తిగత విషయాలను తెలియజేసేందుకు సోషల్ మీడియా తో పాటు ఇలా యూట్యూబ్ ను కూడా సైడ్ బిజినెస్ గా మార్చుకుంది.