Begin typing your search above and press return to search.

సాహోకు ఇంకో కాపీ మరక

By:  Tupaki Desk   |   1 Aug 2019 4:42 AM GMT
సాహోకు ఇంకో కాపీ మరక
X
డార్లింగ్ ప్రభాస్ సాహో ప్రమోషన్ వేగం కొంత పెరిగింది కానీ ఇంకా ఈ కిక్ చాలదంటున్నారు అభిమానులు. రేపు ఓ వీడియో సాంగ్ రాబోతోంది కాబట్టి ఇంకాస్త ఊపు రావొచ్చేమో. ఇంకా పూర్తి స్థాయి ఆల్బమ్ రాకముందే సాహో టీమ్ కొత్త ఎత్తుగడలతో హైప్ ని పెంచే ప్రయత్నాల్లో ఉంది. అందులో భాగంగానే నిన్న సాహో ది గేమ్ అనే మొబైల్ యాప్ ని లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించిన సాహో దీనికి సైతం కాపీ మరక అంటించుకుంది.

ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న రెడీ ప్లేయర్ వన్ అనే గేమ్ థీమ్ ని బేస్ చేసుకుని పోస్టర్ కూడా అచ్చం అదే తరహాలో డిజైన్ చేయడంతో ఇంకేముంది నెటిజెన్లు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నిజానికి సాహో ఈ పోలికల ఇప్పటిది కాదు. గత ఏడాది బర్త్ డే పోస్టర్ తో మొదలుకుని ఇటీవలే వచ్చిన యాక్షన్ బ్లాక్ లుక్ దాకా అన్ని హాలీవుడ్ సినిమాలు గేమ్స్ నుంచి కాపీ కొట్టినట్టుగా ఆధారాలతో సహా బయట పడ్డాయి.

ఇలా స్ఫూర్తి తీసుకోవడం తప్పేమి కాదు కానీ ప్రతి విషయంలోనూ ఆఖరికి పోస్టర్లలోనూ ఇలా చేయడం ఏమిటా అనేదే పబ్లిక్ ప్రశ్న. అయితే బాలీవుడ్ లేదా హాలీవుడ్ ఛాయలు తప్ప ఇది అసలు తెలుగు సినిమానేనా అనేలా సాహో టీమ్ చేస్తున్న హంగామా చూస్తుంటే కాస్త ప్లాన్ మారిస్తే బెటర్ ఏమో అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రెండు వందల కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా నుంచి పబ్లిసిటీ మెటీరియల్ కోసం వాడుకోవడానికి ఇంకేమి లేవా అనే నిలదీతలు కూడా మొదలయ్యాయి. ఇకనైనా అలెర్ట్ గా మారి ప్రమోషన్ వినూత్నంగా చేస్తే బెటర్. అసలే చేతిలో ఉన్న టైం 29 రోజులు మాత్రమే.