Begin typing your search above and press return to search.
'నారప్ప' వెయిట్ మరీ పెంచేస్తున్నారు
By: Tupaki Desk | 25 Feb 2020 7:00 AM GMTతమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’ను తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. పలువురు యంగ్ హీరోల పేర్లు వినిపించినా చివరకు సీనియర్ స్టార్ వెంకటేష్ ఈ రీమేక్ ను చేస్తున్నాడు. సురేష్ బాబు.. కళై పులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రీమేక్ కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా ప్రియమణిని ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. తాజాగా సినిమాపై మరింత ఆసక్తి పెంచే వార్త ఒకటి సినీ వర్గాల్లో వినిపిస్తుంది.
మలయాళ బ్యూటీ రెబ్బా మోనిక జాన్ ను ఈ చిత్రం కోసం మరో హీరోయిన్ గా ఎంపిక చేశారట. ప్రస్తుతం తమిళనాడులోని ఎర్రటి ఎడారి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ లో ఈమె కూడా పాల్గొంటున్నట్లుగా చెబుతున్నారు. మూడు వారాల పాటు ఏకధాటిగా అక్కడ చిత్రీకరణ జరిపిన తర్వాత షూటింగ్ ను మళ్లీ హైదరాబాద్ కు షిప్ట్ చేయబోతున్నారు.
హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి అవ్వబోతుంది. వచ్చే నెలలో సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ఏప్రిల్ లేదా మే లోనే సినిమాను విడుదల అయ్యేలా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్లాన్ చేస్తున్నాడు. సింపుల్ గా ఎక్కువ బడ్జెట్ లేకుండానే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ను పెట్టి సినిమా వెయిట్ ను పెంచేస్తున్నారు. రెబ్బా మోనిక మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. మరి వెంకీకి జోడీగా ఈమె ఎలా ఉంటుందో చూడాలి.