Begin typing your search above and press return to search.

ఇంకా శంక‌ర్ పై దిల్ రాజుకు సందేహం?

By:  Tupaki Desk   |   4 July 2021 12:30 PM GMT
ఇంకా శంక‌ర్ పై దిల్ రాజుకు సందేహం?
X
భార‌తీయుడు 2 (ఇండియ‌న్ 2) వివాదంలో కోర్టుల ప‌రిధిలో లైకాపై శంక‌ర్ పై చేయి సాధించిన నేప‌థ్యంలో ఇక‌పై అత‌డి త‌దుప‌రి చిత్రానికి ఆటంకాలు లేకుండా లైన్ క్లియ‌రైంది. శంక‌ర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని య‌థేచ్ఛ‌గా చిత్రీకరించుకోవ‌చ్చ‌ని చెన్నై హై కోర్ట్ క్లియ‌రెన్స్ ఇవ్వ‌డంతో చ‌ర‌ణ్ - దిల్ రాజు బృందాల‌కు అది ఎంతో ఊర‌ట‌నిచ్చే అంశం.

శంక‌ర్ త‌దుప‌రి సినిమా చేయ‌కుండా నిలువ‌రించాల‌న్న లైకా ప్ర‌య‌త్నానికి న్యాయ‌స్థానాలు గండి కొట్టాయి. హైద‌రాబాద్ హైకోర్ట్ లోనూ దీనిపై లైకా పిటిష‌న్ వేయ‌గా విచార‌ణ లో శంక‌ర్ కి అనుకూల తీర్పు వెలువ‌డుతుంద‌నే అంతా భావిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే దిల్ రాజుకు శంక‌ర్ పై ఉన్న అనుమానాలు క్లియ‌రైన‌ట్టేన‌ని విశ్లేషిస్తున్నారు.

రామ్ చరణ్- దిల్ రాజులకు చెన్నై హైకోర్ట్ తీర్పు పెద్ద ఉపశమనం. లైకా అభ్యర్ధనను చెన్నై కోర్టు తిరస్కరించినప్పుడు స్థానిక హైద‌రాబాద్ కోర్టు తమ సినిమాను నిలిపివేయదని దిల్ రాజు భావిస్తున్నార‌ట‌. ఆగ‌స్టులో ఈ సినిమాని ప్రారంభించేందుకు ఆస్కారం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దిల్ రాజు బ్యాన‌ర్ లో 50వ సినిమాగా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ పాన్ ఇండియా చిత్రానికి దాదాపు 500కోట్ల బ‌డ్జెట్ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఆలియా భ‌ట్ లేదా కియ‌రా అద్వాణీ ఇందులో క‌థానాయిక‌గా న‌టించే వీలుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.