Begin typing your search above and press return to search.

కొత్త మగధీర.. తంబీలు ఏడుస్తున్నారు

By:  Tupaki Desk   |   11 July 2015 6:33 AM GMT
కొత్త మగధీర.. తంబీలు ఏడుస్తున్నారు
X
నచ్చితే పొరుగు సినిమా అయినా ఆదరించే మంచి లక్షణం తెలుగు ప్రేక్షకులకు ఉంది. సూర్య, కార్తీ, అజిత్‌, ఆర్య లాంటి హీరోలకు తెలుగులో మార్కెట్‌ ఉంది అయితే టాలీవుడ్‌ దర్శకనిర్మాతల పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో డబ్బింగ్‌ సినిమాల వల్ల మనకు పెద్ద దెబ్బే అంటూ చెబుతుంటారు. అయితే ఇప్పుడు సీన్‌ మొత్తం రివర్సులో ఉంది. తెలుగు సినిమా తమిళ తంబీల మీదికి ఎక్కి సవారీ చేస్తోంది.

నిన్న రిలీజైన బాహుబలి తంబీల మెదడుని తొలిచేస్తోంది. ఒక డబ్బింగ్‌ సినిమాకు ఈ క్రేజేంటి అన్నట్లుంది. అంతేనా ఇక నుంచి చరణ్‌, బన్ని, మహేష్‌ లాంటి స్టార్‌ హీరోల నుంచి వార్‌ మొదలు కానుంది. చరణ్‌ నటించిన 'మగధీర' ఇప్పటికే తమిళ బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించింది. అలాగే 'ఎవడు' చిత్రాన్ని 'మగధీర' అనే పేరుతో అనువదించి రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ ఓవర్‌ ఎక్స్‌పోజింగ్‌ తమిళ ఆడియెన్‌ని థియేటర్లకి రప్పిస్తుందని తమిళ బయ్యర్లు భావిస్తున్నారట. ఇదే విషయాన్ని పాయింట్‌ అవుట్‌ చేస్తూ తెలుగులో ఓవర్‌ ఎక్స్‌పోజింగ్‌ అంటూ బ్లేమ్‌ చేసేందుకు చూస్తున్నారక్కడ.

అయితే గతంలో రిలీజైన పూజై చిత్రంలో శ్రుతి అందాల విందును మర్చిపోయినట్టున్నారు తంబీలు. అంతేనా అపరిచితుడు, శివాజీ, ఐ వంటి చిత్రాల్లో కథానాయికల ఓవర్‌ ఎక్స్‌పోజింగ్‌ గురించి మాట్లాడడం లేదెందుకో. ఏదో ఒక కారణం చెప్పి తంబీలు మనపై పడి ఏడ్వడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.