Begin typing your search above and press return to search.
ఉత్తరప్రదేశ్ సీఎం ఇలాకాలో `ది కశ్మీర్ ఫైల్స్`
By: Tupaki Desk | 20 March 2022 5:52 PM GMTవివాదాస్పద అంశాలతో సినిమాలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా తెరకెక్కించిన అత్యంత వివాదాస్పద చిత్రం `ది కశ్మీర్ ఫైల్స్. అనుపమ్ ఖేర్, మిధున్ చక్రవర్తి, పల్లవి జోషీ, దర్శన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. కశ్మీర్ పండిట్ ల నరమేధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కొంత మంది ఈ మూవీపై విమర్శలు చేస్తుంటే మరి కొంత మంది ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే రాజకీయ వర్గాలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు `ది కశ్మీర్ ఫైల్స్` చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారతీయ చరిత్రలో రక్తంతో రాసిన అత్యంత భయానకమైన ఆంశాలని కళ్లకు కట్టినట్టుగా చూపించారని. కశ్మీరీ పండిట్ లపై జరిగిన దారుణ మారణ కాండని కళ్లకు కట్టినట్టుగా చూపించారని దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈచిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించి అభినందించారు.
తాజాగా `ది కశ్మీర్ ఫైల్స్` టీమ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా టీమ్ ని అభినందించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ అద్భుతమైన సినిమా తీశారంటూ ప్రశంసించారు. మోగి ఆదిత్యనాథ్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన `ది కశ్మీర్ ఫైల్స్` టీమ్ లో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నటి, నిర్మాత పల్లవి జోషీ, అనుపమ్ ఖేర్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ పాల్గొన్నారు.
1990లో కశ్మీర్ లో ఓ సామాజిక వర్గంపై జరిగిన దారుణ మారణ కాండ నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు ఎన్నో వ్యవ ప్రయాసల కోర్చి తెరకెక్కించారు. సినిమాపై ఓ వర్గం చేస్తున్న విమర్శల నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కి ప్రభుత్వం వై కేటగిరి భద్రతని కల్పించడం విశేషం. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపుగా 150 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.