Begin typing your search above and press return to search.

నువ్వే నా నైతిక మ‌ద్ధ‌తు సోద‌రా.. బ‌న్ని ఎమోష‌న్!!

By:  Tupaki Desk   |   30 May 2021 8:30 AM GMT
నువ్వే నా నైతిక మ‌ద్ధ‌తు సోద‌రా.. బ‌న్ని ఎమోష‌న్!!
X
త‌న సోద‌రుడు శిరీష్ అంటే బ‌న్ని ప్రేమాభిమానాల గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య బాండింగ్ ప్ర‌తిసారీ చ‌ర్చ‌నీయాంశ‌మే. శిరీష్ ని ఒక్కో మెట్టు ఎక్కిస్తూ స్టార్ హీరోని చేయాల‌న్న‌ది బ‌న్ని ప్లాన్. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా త‌న సోద‌రుడు బ‌న్ని స్ఫూర్తితో శిరీష్ హార్డ్ వ‌ర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.

నేడు శిరీష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అల్లు అర్జున్ ఎమోష‌న్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. బన్నీ ఇన్ స్టా లో శిరీష్ తో క‌లిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి విషెస్ తెలిపారు. ``నా అతి పెద్ద నైతిక మద్దతు.. నా స్వీటెస్ట్ సోదరుడికి వండ‌ర్ ఫుల్ డే.. క‌లిసొచ్చే కాలం ముందుంది.. రానున్న‌ది సుందరమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను`` అని ఎమోష‌న‌ల్ వ్యాఖ్య‌ను జోడించారు. శిరీష్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమాతో పెద్ద విజ‌యం సాధించాల‌నేది బ‌న్ని ఆకాంక్ష‌. మ‌రోవైపు శిరీష్ కి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా శిరీష్ న‌టిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్రేమ కాదంట అనేది టైటిల్. ఈ చిత్రంలో శిరీష్ స‌ర‌స‌న `నా పేరు సూర్య` ఫేం అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌. ఆ ఇద్ద‌రి కెమిస్ట్రీ పోస్ట‌ర్ల‌లో అద్భుతంగా వ‌ర్క‌వుటైంది.