Begin typing your search above and press return to search.
నా తల కాదు.. ఓ కాలు తీసుకోండి -దీపిక
By: Tupaki Desk | 2 Feb 2018 8:34 AM GMTపద్మావత్ సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ... వివాదాలు - గొడవలు అంతా రచ్చ రచ్చయిపోయింది. కొందరైతే ఏకంగా దీపిక ముక్కు - తల తీసుకొస్తే... కోట్ల డబ్బు ఇస్తామంటూ ప్రకటన చేశారు. ఆ ప్రకటనలపై అప్పట్లో దీపిక అస్సలు స్పందించలేదు. ఇప్పుడు సినిమా విడుదలయ్యాక ఆమె నోరు విప్పింది.
ఎన్నో వివాదాల బారిన పడి... విడుదల వాయిదాలు పడుతూ చిట్ట చివరకు ఎలాగో విడుదలైంది పద్మావత్. మా సినిమాలో పద్మావతిని చెడుగా చూపించడం లేదని చెప్పినా ముందు ఎవరూ వినలేదు. సినిమా విడుదలయ్యాక అందులో ఏం వివాదమూ లేదని అర్థమైపోయింది. షూటింగ్ టైములో దీపిక తల తెస్తే అయిదు కోట్లు ఇస్తామంటూ ఒకరు ప్రకటించారు. మరొకరు ముక్కు కోసి తెమ్మని ప్రకటించారు. ఆ సమయంలో దీపిక చాలా ధైర్యంగా - నిశ్శబ్ధంగా ఉంది. ఇప్పుడు ఓ ఇంటర్య్వూలో నోరు విప్పింది. తాను అలాంటి వాటికి భయపడే రకాన్ని కాదని చెప్పకనే చెప్పింది. తనకు తన ముక్కంటే చాలా ఇష్టమని కనుక ముక్కు తీసుకోవద్దని - కాళ్లు పొడుగ్గా ఉంటాయి కనుక...ఓ కాలు తీసుకోమని చెప్పింది.
తనకు పద్నాలుగేళ్ల వయసులో రోడ్డు మీద వెళుతుంటే ఓ వ్యక్తి కావాలనే రాసుకుంటూ వెళ్లాడని, ఆ వయసులో కూడా తాను భయపడలేదని చెప్పింది. ఆ వ్యక్తిని ఆపి చెంప మీద లాగి పెట్టి ఒకటిచ్చానని చెప్పింది. రాణి పద్మిని క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఆమె ఎంతో వీర వనిత అని - చేతిలో ఖడ్గం లేకపోయినా తన మౌనంతోనే యుద్ధం చేయగలదని చెప్పింది దీపిక. త్వరలో మరో బయోపిక్ లో నటించనుంది ఈ పొడుగు కాళ్ల సుందరి.
ముంబైకి చెందిన మాపియా క్వీన్ రహీమా ఖాన్ పాత్రలో కనిపించనుంది దీపికా. ఆ సినిమాకు సప్నా దీదీ అనే పేరు పెట్టారు.