Begin typing your search above and press return to search.

మ‌హేష్ బెట్టింగ్ లెక్క‌లకు కేటీఆర్ షాక్!

By:  Tupaki Desk   |   28 April 2018 4:59 PM GMT
మ‌హేష్ బెట్టింగ్ లెక్క‌లకు కేటీఆర్ షాక్!
X
శుక్ర‌వారం నాడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, విల‌క్ష‌ణ దర్శకుడు కొరటాలలు పాల్గొన్న‌ `విజ‌న్ ఫ‌ర్ ఎ బెట‌ర్ టుమారో` అనే కార్య‌క్ర‌మం వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా కేటీఆర్, మ‌హేష్ లు అనేక సామాజిక అంశాల‌పై స‌ర‌దాగా స్పందించ‌డ‌మే కాకుండా ....ఎన్నో విలువైన విష‌యాల‌ను ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో చ‌ర్చ‌కు వ‌చ్చేలా చేశారు. ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న యువ‌తీయువ‌కులు....కేటీఆర్ - మ‌హేష్ ల‌ను ప్ర‌శ్న‌లు అడిగారు. పౌరులు స‌క్ర‌మంగా న‌డుచుకునేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఓ యువ‌కుడు అడిగిన ప్ర‌శ్న‌కు కేటీఆర్ ఆస‌క్తిక‌ర స‌మాధాన‌మిచ్చారు. అదే స‌మ‌యంలో.....పౌరుల మంచి కోరే కొన్ని నిబంధ‌న‌ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌పుడు కొన్నిసార్లు...తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఉదాహ‌ర‌ణ‌కు తెలంగాణ‌లో పేకాట క్ల‌బ్ లు మూసేయించామ‌ని, వాటికి అనుబంధంగా గుడుంబా, గుట్కాలు బంద్ చేయించామ‌ని అన్నారు. అదే క్రమంలో మ‌రింత దూకుగుగా అసాంఘిక కార్య‌క‌లాపాలు, చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌కు చెక్ పెట్టేందుకు తెలంగాణ స‌ర్కార్ ముందుకు వెళ్ల‌బోయే స‌మ‌యంలో ప్రాక్టిక‌ల్ గా కొన్ని ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని కేటీఆర్ అన్నారు. పేకాట క్ల‌బ్ లు బంద్ చేయ‌గానే ...ఆన్ లైన్ ర‌మ్మీ ఆడ‌డం మొద‌లుపెట్టార‌ని....వేల కోట్ల వ్యాపారం జ‌రుగుతోంద‌ని సీఎం గారికి పోలీసులు వివ‌రించార‌ని చెప్పారు. ఆన్ లైన ర‌మ్మీని కూడా మూసివేశామ‌ని...అపుడు ఆ నిర్వాహ‌కులు ఇది ప్రజాస్వామ్య విరుద్ధ‌మ‌ని గొడ‌వ చేశార‌ని గుర్తు చేశారు.

ఈ స‌మ‌యంలో మ‌హేష్ మాట్లాడుతూ....ఈ త‌ర‌హా ఆన్ లైన్ బెట్టింగ్ ను మూయ‌లేమ‌ని...చాలా ర‌కాలుగా ఉంటాయ‌ని....అవి వింటే మీరు షాక్ అవుతార‌ని కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. క్రికెట్ లో ర‌క‌ర‌కాలుగా బెట్టింగ్ పెడ‌తార‌ని....నెక్స్ట్ బాల్ ....నోబాల్ - వైడ్ అని కూడా బెట్టింగ్ వేస్తార‌ని మ‌హేష్ అన‌డంతో అక్క‌డున్న వారంత న‌వ్వారు. మ‌హేష్ మాట్లాడుతుండ‌గా కేటీఆర్ క‌ల్పించుకొని.....``నీతో ఇది ఎవ‌రు మాట్లాడారో చెప్పు...వాడ్ని కూడా మూయిద్దాం`` అని సెటైర్ వేశారు. ఆన్ లైన్ ర‌మ్మీతో పాటు మ‌రికొన్ని ఆన్ లైన్ బెట్టింగ్ సైట్లకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చామ‌న్నారు. తెలంగాణ‌లో ఆడేందుకు వీల్లేద‌ని యూజ‌ర్ల‌కు మెసేజ్ వ‌చ్చేలా పాప‌ప్ ఇవ్వాల్సింది...ఆ సైట్ నిర్వాహ‌కుల‌కు గ‌ట్టిగా చెప్పామ‌ని అన్నారు. తెలంగాణ‌లో వాడేవారికి అలాగే మెసేజ్ వ‌స్తోంద‌ని ...ఒక‌వేళ నీకు రావ‌డం లేదంటే...మ‌రి నువ్వు ఏం వాడుతున్నావో చెప్పు అంటూ...మ‌హేష్ ను ఉద్దేశించి కేటీఆర్ చ‌మ‌త్క‌రించారు. అయితే, రెస్టారెంట్ల‌లో, ఇళ్ల‌లో టీవీల‌లో ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తూ...బెట్టింగ్ లు పెడుతున్నార‌ని మ‌హేష్ లేవ‌నెత్తిన పాయింట్ కు...కేటీఆర్ బ‌దులిచ్చారు. ఇందాక తాను చెప్పిన‌ట్లు పౌరుల్లో స్వీయ నియంత్ర‌ణ ఉండాల‌ని....ప్ర‌తి ఒక్కరి ఇంటికి వెళ్లి ...కాళ్లు చేతులు క‌ట్టేసి ....నియంత్రించ‌డం సాధ్యం కాద‌ని కేటీఆర్ అన్నారు. మొత్తానికి వారిద్ద‌రి స‌ర‌దా సంభాష‌ణ‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.