Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డే పార్టీలో సీక్రెట్‌ బోయ్ ఫ్రెండ్ తో!

By:  Tupaki Desk   |   1 Aug 2019 4:31 PM GMT
బ‌ర్త్ డే పార్టీలో సీక్రెట్‌ బోయ్ ఫ్రెండ్ తో!
X
ముంబై `ఫేజ్- 3` క‌ల్చ‌ర్ లో నైట్ పార్టీల హ‌డావుడి గురించి తెలిసిందే. బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు రెగ్యుల‌ర్ వ్యాప‌క‌మిది. నిరంత‌రం ఏదో ఒక చోట సెల‌బ్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి. ఈసారి పార్టీ కియ‌రా అద్వాణీ వంతు. ఈ భామ ఇటీవ‌లే 27వ బ‌ర్త్ డే జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా ముంబై టాప్ సెల‌బ్రిటీల‌కు అదిరిపోయే పార్టీ ఇచ్చిందిట‌. ఈ పార్టీలో క‌బీర్ సింగ్ కోస్టార్ షాహిద్ క‌పూర్- క‌ర‌ణ్ జోహార్-ఆథియా శెట్టి- సిద్ధార్థ్ రాయ్ క‌పూర్- పునీత్ మ‌ల్హోత్రా- ఆర్మాన్ జైన్- విక్ర‌మ్ ఫ‌డ్నిస్ త‌దిత‌ర‌ ప్ర‌ముఖులు చీర‌ప్ చేశారు.

ఆస‌క్తిక‌రంగా ఈ పార్టీలో ఓ సీక్రెట్ మేన్ గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. బ‌ర్త్ డే పార్టీకి ఈ స్పెష‌ల్ గెస్ట్ ని కియ‌రా ఆహ్వానించ‌డ‌మే కాదు.. ఆ ఇద్ద‌రూ ఒకే కార్ లో అక్క‌డికి విచ్చేయ‌డంతో పార్టీలోనే గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఇంత‌కీ ఆ సీక్రెట్ మేన్ ఎవ‌రు? అంటే.. ఇంకెవ‌రు.. యంగ్ హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా. ప్ర‌స్తుతం కియ‌రాకి జోడీగా `షేర్ షా` అనే భారీ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇంతకుముందు ఆ ఇద్ద‌రికీ మ‌ధ్యా ఏదో ఉంద‌న్న ప్ర‌చారం సాగింది. అయితే ప్ర‌తిసారీ ఆ ఇద్ద‌రూ ఆ ప్ర‌చారంలో నిజం లేద‌ని ఖండిస్తున్నారు.

నేనింకా సింగిల్. ఎవ‌రితోనూ ప్రేమ‌లో లేన‌ని కియ‌రా ప‌లుమార్లు వెల్ల‌డించింది. అయినా సిద్ధార్థ్ తో కియ‌రా ప్రేమాయ‌ణంపై గుస‌గుస‌లు వినిపిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ మీడియా ఆ ఇద్ద‌రూ ఎక్క‌డ ఉన్నా క్యాచ్ చేస్తూ ప్ర‌త్యేక క‌థ‌నాలు వండి వారుస్తోంది. నిన్న‌టి రోజున ఒకే కార్ లో పార్టీకి రావ‌డంతో మ‌రోసారి ఈ ల‌వ్ క‌పుల్ పై ఊహాగానాలు జోరెక్కాయి. ఇంత‌కీ ఆ స్పెష‌ల్ మ్యాన్ తో కియ‌రాకి ఉన్న అనుబంధం ఏమై ఉంటుంది? `షేర్ షా` చిత్రంతో పాటు ఆ వెంట‌నే కియ‌రా మ‌రోసారి సిద్ధార్థ్ తోనే న‌టించ‌నుంద‌ట‌. గ్యాప్ లేకుండా సిద్ధూని మిస్ చేస్కోకుండా కెరీర్ ని ప్లాన్ చేస్తోంది. ఇక అత‌డితో ప్రేమాయ‌ణంపై త‌నే స్ప‌ష్ట‌త నిస్తుందేమో చూడాలి. `భ‌ర‌త్ అనే నేను` త‌ర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయిన కియ‌రా సిద్ధార్థ్ స‌ర‌స‌న రెండు సినిమాలు చేస్తూనే ల‌క్ష్మీ బాంబ్.. గుడ్ న్యూస్ అనే రెండు భారీ చిత్రాల్లోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. ఈ బిజీలోనే టాలీవుడ్ ని ఈ అమ్మ‌డు లైట్ తీస్కుంద‌ని అర్థ‌మ‌వుతోంది.