Begin typing your search above and press return to search.

క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి అమ్మడూ..!

By:  Tupaki Desk   |   15 Oct 2022 9:44 AM GMT
క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి అమ్మడూ..!
X
బుల్లితెర మీద సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి వెండితెరపై హీరోయిన్ గా రాణిస్తోంది అందాల భామ మృణాల్ ఠాకూర్. 'సీతా రామం' సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతా రామం' సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా నటించింది మృణాల్. సీతా మహాలక్ష్మీగా ప్రిన్సెస్ నూర్జహాన్ గా అద్భుతమైన నటన కనబరిచింది. తిప్పుకోనివ్వలేని ఆమె అందం.. మనోహరమైన లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

'సీతారామం' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. మృణాల్ పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా తెలుగులో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకొంది. మరోవైపు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.

ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ కు ఇప్పుడు వరుస ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆమెను హీరోయిన్ గా తీసుకోడానికి ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. అయితే అమ్ముడు మాత్రం ఈ హైప్ ను క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం లేదనిపిస్తోంది.

సాధారణంగా, ఏ హీరోయిన్ అయినా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే.. వెంటనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతాయి. అందుకే ప్రతీ హీరోయిన్ కూడా తనకున్న క్రేజ్ ను ఉపయోగించుకోవాలని భావిస్తుంది. కానీ మృణాల్ మాత్రం 'సీతా రామం' తర్వాత ఒక్క చిత్రానికి కూడా సైన్ చేయలేదు. ఒకవేళ కమిట్ అయినా ఇంతవరకూ అధికారిక ప్రకటన చేయలేదు.

టాలీవుడ్ వంటి కమర్షియల్ ఇండస్ట్రీలో ఎంత క్రేజీ హీరోయిన్ అయినా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటేనే.. ఎక్కువ కాలం స్టార్ గా రాణించవచ్చు. పూజా హెగ్డే - రష్మిక మందన్నా వంటి హీరోయిన్లు ఈ విషయాన్ని పసిగట్టి టాప్ రేంజ్ లో దూసుకుపోతున్నారు.

కానీ మృణాల్ మాత్రం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు కనిపించడం లేదు. సీతా రామం జోరును కొనసాగించడానికి ఈ బ్యూటీ ఇప్పుడు కనీసం ఒక్క భారీ చిత్రాన్నైనా ప్రకటించాల్సి ఉంది. లేకపోతే టాలీవుడ్ దర్శక నిర్మాతలే కాదు.. జనాలు కూడా ఆమెను త్వరగా మరచిపోయే అవకాశం ఉంది.

ఇకపోతే తెలుగులో మృణాల్ ఠాకూర్ ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు కానీ.. హిందీలో మాత్రం నాలుగు చిత్రాలతో పలకరించబోతోంది. 'పిప్పా' 'పూజా మేరీ జాన్' 'ఆంఖ్ మిచోలి' 'గుంరాహ్' వంటి సినిమాల్లో మృణాల్ నటిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.