Begin typing your search above and press return to search.
గుర్తు పట్టలేనంతగా శర్వా...!
By: Tupaki Desk | 17 Dec 2018 3:45 PM GMTశర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ చిత్రంతో ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వం లో రూపొందిన ఆ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఆ చిత్రం పై శర్వానంద్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మరో వైపు ఈయన సుధీర్ వర్మ దర్శకత్వం లో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. శర్వానంద్ రెండు షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మాఫియా డాన్ గా పాత్రతో పాటు, ఒక మామూలు యువకుడి పాత్రల్లో శర్వానంద్ ను సుధీర్ బాబు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. యంగ్ కుర్రాడి పాత్రలో సాదారణంగానే కనిపించే శర్వా మాఫియా డాన్ పాత్రలో మాత్రం చాలా విభిన్నంగా కనిపించనున్నాడట. ఆ పాత్రలో శర్వానంద్ ను చూడగానే గుర్తించలేనంత విభిన్నంగా మేకోవర్ ను ప్లాన్ చేశారట. ప్రముఖ బాలీవుడ్ మేకోవర్ ఆర్టిస్టు శర్వాను వయస్సు పై బడిన మాఫియా డాన్ గా తయారు చేసినట్లుగా చెబుతున్నారు.
ఈ చిత్రం కోసం ‘దళపతి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న దళపతి మూవీ టైటిల్ తో వస్తే ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ‘దళపతి’ చిత్రంను ఇప్పటికే మరో నిర్మాత రిజిస్ట్రర్ చేయించాడట. ఆ నిర్మాత ఒప్పుకుంటే తప్ప శర్వా కు ఆ టైటిల్ దక్కదు. శర్వానంద్ చాలా విభిన్నంగా కనిపించబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.