Begin typing your search above and press return to search.

యంగ్ డైరెక్ట‌ర్ మెగాస్టార్ తో ఊ.. అనిపిస్తాడా?

By:  Tupaki Desk   |   27 Sep 2022 1:33 PM GMT
యంగ్ డైరెక్ట‌ర్ మెగాస్టార్ తో ఊ.. అనిపిస్తాడా?
X
మెగాస్టార్ చిరంజీవి మునుపెన్న‌డూ లేనంత‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ని అంగీక‌రిస్తున్న విష‌యం తెలిసిందే. వ‌రుస ప్రాజెక్ట్ ల‌ని అంగీక‌రించ‌డ‌మే కాకుండా ఓకే సారి మూడు సినిమాల‌ని సెట్స్ పైకి తీసుకెళ్లారు కూడా. అందులో మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫ‌ర్‌' ఆధారంగా తెర‌కెక్కిన 'గాడ్ ఫాద‌ర్‌' రిలీజ్ కి రెడీ అయిపోయింది. మెగాస్టార్ డాన్ గా న‌టించిన ఈ మూవీని అక్టోబ‌ర్ 5న ద‌స‌రా కు భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

ఈ మూవీతో పాటు మ‌రో రెండు సినిమాలు కూడా వ‌ర్ బై వ‌న్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. బాబి డైరెక్ష‌న్ లో చేస్తున్న 'వాల్తేరు వీర‌య్య‌' వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు కావ‌డానికి రెడీ అవుతోంది. ఇక త‌మిళ హిట్ ఫిల్మ్ 'వేదాలం' ఆధారంగా మెహ‌ర్ ర‌మేష్ 'భోళా శంక‌ర్‌' పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. కీర్తి సురేష్ చిరుకు సోద‌రిగా న‌టిస్తున్న ఈ మూవీ కూడా త్వ‌ర‌లోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇదిలా వుంటే ఈ మూడు సినిమాల‌తో పాటు మెగాస్టార్ మ‌రో రెండు సినిమాల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ద‌ర్శ‌కుడు మారుతితో ఓ ప్రాజెక్ట్‌.. వెంకీ కుడుముల‌తో మ‌రో ప్రాజెక్ట్. ఈ రెండింటిలో ముందుకు ప్ర‌క‌టించింది వెంకీ కుడుముల ప్రాజెక్ట్‌. డీవీవీ దాన‌య్య నిర్మాత‌గా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా కొన్ని నెల‌ల క్రితం ప్ర‌క‌టించారు.

అయితే ఆ త‌రువాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి. దీనిపై మేక‌ర్స్ కానీ ద‌ర్శ‌కుడు కానీ ఎలాంటి రిప్లై ఇవ్వ‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఆగిన‌ట్టేన‌ని అంతా భావించారు.

అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేద‌ని తెలుస్తోంది. ముందు చెప్పిన క‌థ చిరుకు న‌చ్చ‌క‌పోవ‌డంతో కొత్త క‌థ‌తో ర‌మ్మ‌న్నార‌ట‌. ఆ త‌రువాత కొత్త కథ‌తో వెళితే ఫ‌స్ట్ పార్ట్ నెరేష‌న్ అయిపోయింది.

కానీ సెకండ్ పార్ట్ లో చిరు భారీ మార్పులు చెప్పార‌ట‌. రీసెంట్ గా సెకండ్ హాఫ్ ఫైన‌ల్ డ్రాఫ్ట్ ని పూర్తి చేసిన వెంకీ కుడుముల త్వ‌ర‌లోనే మెగాస్టార్ కు వినిపించి ఆయ‌నతో ఊ అనిపించ‌బోతున్నార‌ట‌. చిరు ఊ అంటే ఈ మూవీ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌డం ఖాయం అనితెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.