Begin typing your search above and press return to search.
డిజాస్టర్ లతో యంగ్ హీరో ఉక్కిరిబిక్కిరి
By: Tupaki Desk | 15 Dec 2021 2:30 PM GMTటాలీవుడ్ లో యంగ్ హీరో వరుస డిజాస్టర్ లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? అంటే అది నిజమే అని తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు నాగశౌర్య. గత కొంత కాలంగా ఈ యంగ్ హీరో ఏ సినిమా చేసినా వర్కవుట్ కావడం లేదు. నాగశౌర్య భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న `లక్ష్య` గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇంపాక్ట్ ని కలిగించలేకపోయింది.
సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీని నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా కలిసి నిర్మించారు. `రొమాంటిక్ ` ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటించారు. నాగశౌర్య ఈ మూవీ కోసం చాలా కఠోరంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. 8 ప్యాక్ బాడీతో కనిపించినా నాగశౌర్యకు ఎలాంటి ఫలితాన్ని అందించలేకపోయింది.
ఇదిలా వుంటే ఇప్పటి వరకు `లక్ష్య`తో కలిపి నాగశౌర్య వరుసగా ఆరు డిజాస్టర్ లని దక్కించుకున్నాడు. `ఛలో` తో హిట్ ని దక్కించుకున్న నాగశౌర్య ఆ తరువాత చేసిన కణం, అమ్మమ్మగారిల్లు, నర్తన శాల, అశ్వద్ధామ, వరుడు కావలెను.. తాజాగా లక్ష్య వరకు వరుసగా ఆరు డిజాస్టర్ లని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తున్న ఈ యంగ్ హీరో వరుస ఫ్లాపుల కారణంగా కెరీర్ విషయంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. డిఫరెండ్ కథలతో ముందుకెళుతున్న నాగశౌర్య స్క్రిప్ట్ ఎంపికలో మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడమే చేదు అనుభవాల్ని మిగులుస్తోందని, ఎంత హార్డ్ వర్క్ చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతోందని అంతా అంటున్నారు. ఇప్పటికైనా తన పంథాను మార్చుకేని మంచి కథల్ని ఎంచుకుని మళ్లీ ట్రాక్ లోకి రావాలని కోరుకుంటున్నారు ఆయన శ్రేయోభిలాషులు.