Begin typing your search above and press return to search.

విడాకుల తర్వాత తెలుగమ్మాయితో యువ హీరో డేటింగ్..?

By:  Tupaki Desk   |   20 Jun 2022 3:27 PM GMT
విడాకుల తర్వాత తెలుగమ్మాయితో యువ హీరో డేటింగ్..?
X
ఇటీవల కాలంలో బాలీవుడ్ మీడియా టాలీవుడ్ స్టార్స్ మరియు తెలుగు సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో అప్పుడప్పుడు మన స్టార్ల గురించి రకరకాల ఊహాగానాలు.. ధృవీకరించని కథనాలను నివేదిస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్టుగా భార్య నుంచి విడిపోయిన ఓ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో.. మళ్లీ ప్రేమలో పడ్డట్టు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.

స్టార్ హీరోయిన్ ని ప్రేమ వివాహం చేసుకున్న ఆ టాలీవుడ్ హీరో.. గతేడాది వివాహ బంధాన్ని బ్రేక్ చేసుకుంటున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం వారిద్దరూ వేర్వేరు మార్గాల్లో పయనిస్తూ.. విడివిడిగా ఎవరి జీవితం వారు గడుపుతున్నారు.

ప్రస్తుతం సింగిల్ గానే ఉన్న ఆ హీరో.. భార్య నుంచి విడిపోయాక పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. అయితే ఇప్పుడు అతను మరో హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ ప్రధాన మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. యువ హీరో ఇటీవల ఒక మోడల్ కమ్ తెలుగు హీరోయిన్ తో కనిపించాడు. హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న అతని ఇంటి నుంచి ఇద్దరూ ఒకే కారులో బయలుదేరి వెళ్లినట్లు చెబుతున్నాయి. ఇటీవల ఓ పాన్ ఇండియా మూవీలో నటించిన ఆ నటి.. ప్రమోషన్ల సమయంలో చాలాసార్లు కలుసుకున్నారని నివేదికలో జోడించారు.

యువ హీరో తన కో స్టార్ ఒకరితో డేటింగ్ చేస్తున్నాడని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. అయితే అవన్నీ తప్పుడు వార్తలని తేలింది. ఇప్పుడు వైజాగ్ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైతే ఎవరూ దీన్ని ఖండించలేదు.

కాకపోతే అతను ప్రస్తుతానికి ఏ నటితోనూ డేటింగ్ చేయడానికి ఆసక్తి చూపడం లేదని.. ఇప్పటికైతే ఒంటరి జీవితాన్ని గడపాలని అంటున్నారని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం దీనికి పూర్తి భిన్నంగా చెబుతోంది. ఇందులో నిజమెంత? ఇది కూడా ఎప్పటిలాగే గాలి వార్తేనా? అనే వాటికి కాలమే సమాధానం చెప్పాలి.