Begin typing your search above and press return to search.

క్రిటిక్స్ పై విరుచుకు ప‌డ్డ కుర్ర‌హీరో

By:  Tupaki Desk   |   18 Nov 2019 2:30 PM GMT
క్రిటిక్స్ పై విరుచుకు ప‌డ్డ కుర్ర‌హీరో
X
బావున్న సినిమాని బాలేదు అని.. బాలేని సినిమాని బావుంది అని క్రిటిక్స్ రాయ‌రు. అయితే ఆ యంగ్ హీరో సినిమా ఇలా థియేట‌ర్ల‌లోకి రాగానే అలా రివ్యూల్లో పూర్తిగా ఏకుమేక‌య్యారు. సినిమాలో ఔట్ డేటెడ్ కామెడీ బాలేద‌ని హీరో మ‌రో ఫెయిల్యూర్ ని ఎదుర్కొన్నాడ‌ని సమీక్ష‌కులు సూటిగానే రివ్యూల్లో విమ‌ర్శించారు. అయితే ఈ విమ‌ర్శ‌ల్ని స‌ద‌రు హీరోగారు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ట‌. అంతేకాదు.. రివ్యూలు రాసిన వాళ్ల‌పై ప‌బ్లిగ్గానే అస‌హ‌నం వెళ్ల‌గ‌క్కారు. థియేట‌ర్ల‌లో ఆడియెన్ కి న‌చ్చినా రివ్యూలు రాసేవాళ్ల‌కు న‌చ్చ‌క‌పోవ‌డ‌మేమిటి? అంటూ విరుచుకుప‌డుతున్నాడ‌ట‌.

అయితే ఆ హీరోగారి ఆవేద‌న‌కు అర్థం ప‌ర్థం ఉందా? అంటే అదేమీ క‌నిపించ‌డం లేదు. రిలీజైన మూడు నాలుగు రోజుల‌కే ఈ సినిమా ఆడుతున్న థియేటర్లు ఆల్మోస్ట్ ఖాళీ. కొన్ని థియేట‌ర్ల‌లో రూ.3000 కూడా వ‌సూల‌వ్వడం లేదంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. థియేట‌ర్ మెయింటెనెన్స్ కే క‌ష్టం ఇలాంటి వ‌సూళ్ల‌తో. అద్దెలు ఎదురు క‌ట్టాల్సి ఉంటుంది. మ‌రి అలాంటి సినిమాలో న‌టించి ఇప్పుడు క్రిటిక్స్ అన్నారు అని ఆవేద‌న‌కు గురైతే ఏం ఉప‌యోగం? ఇలా అయితే భ‌విష్య‌త్ లో స‌ద‌రు హీరోతో నిర్మాత‌లు సినిమాలు తీసే ప‌రిస్థితి ఉంటుందా? అంటూ ప్ర‌స్తుతం క్రిటిక్స్ లోనూ చ‌ర్చ సాగుతోంది.

అయినా గ‌త కొంత‌కాలంగా సొంతంగా సినిమాలు తీసుకుంటున్న‌ది ఎందుకో. సొంత బ్యాన‌ర్ అంటూ త‌న‌కు తానే పెట్టుబ‌డులు పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఎందుకొచ్చింది? బ‌య‌ట నిర్మాత‌లు ఎందుకు చేయ‌డం లేదు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రైతే. కంటెంట్ పై దృష్టి పెట్ట‌కుండా ఇలా క్రిటిక్స్ పై విరుచుకుప‌డితే ఏం లాభం? ఇటీవ‌ల సృజ‌నాత్మ‌క దర్శ‌కుల‌ క‌థ‌ల్లో క్రియేటివిటీ పాళ్లు బావుంటుంటే పాత ప‌ద్ధ‌తిలోనే ఎందుకు వెళ్లాలి. అయినా ప్ర‌మోష‌న్ వ‌ర‌కూ క్రిటిక్స్ కావాలి.. కానీ సినిమా ఎలా ఉందో చెప్పేందుకు మాత్రం క్రిటిక్స్ అక్క‌ర్లేదా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం త‌మ‌ను విమ‌ర్శించిన యంగ్ హీరోపై క్రిటిక్స్ ఫుల్ గా గుర్రుమీద ఉన్నార‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా యంగ్ హీరో? అంటే చెప్పాలా.. మీరే క‌నిపెట్టొచ్చు ఈజీగా..! ట్రై హు హి ఈజ్?