Begin typing your search above and press return to search.
డ్రైవ్ ఇన్ దగ్గర కుర్ర హీరో హడావుడి
By: Tupaki Desk | 9 July 2017 8:50 AM GMTఇప్పుడు టాలీవుడ్లో కుర్ర హీరోల జోరు బాగానే ఎక్కువైంది. ఒకప్పుడు హైదరాబాద్ సిటీలో హ్యాంగ్ అవుట్ అయ్యే ప్లేసులో చాలా లిమిటెడ్ గా ఉండేవి. అయితే ఇప్పుడివి గణనీయంగా పెరగడంతో మన హీరోలు కూడా రోజుకోచోట కనిపిస్తూ సందడి చేస్తున్నారు. కట్ చేస్తే ఇక్కడ చెబుతున్న హీరోకు ఇంకా స్టార్డమ్ రాలేదు కాని.. ఒక రిచ్ ప్రొడ్యూసర్ కొడుకుగా మనోడు ఇండస్ర్టీలో అందరికీ బాగానే తెలుసు. కాని ఇతగాడ్ని యావత్ ఇండియా అంతా గుర్తుపట్టాలంటే కష్టమేగా.
జూబ్లీ హిల్స్ లో ఈ మధ్యనే కొత్తగా ఒక డ్రైవ్ ఇన్ అనే ప్లేసు పెట్టారు. అక్కడికి కారుతో సహా లోపలకి వెళ్ళి పార్కింగ్ చేసుకుంటే.. నచ్చిన షాపు నుండి నచ్చినది ఆర్డర్ ఇచ్చి కారు దగ్గరకే తెప్పించుకోవచ్చు. గత రాత్రి ఇలాగే 1 గంటకు మన కుర్ర హీరో.. తన సినిమాల్లో నటించకపోయినా కూడా తనకు 'మాంచి' స్నేహితురాలిగా మారిన ఒక హీరోయిన్ తో కలసి అక్కడికి తన బెంజులో వచ్చాడు. కాని వచ్చేపాటికే అక్కడి పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. అయితే మనోడు 'నేనో హీరోను భయ్యా.. నన్ను గుర్తు పట్టేలేదా? నాకు కాస్త ప్లేస్ ఇవ్వండి పార్కింగ్ కు' అంటూ కాసేపు హడావుడే చేశాడు. విషయం ఏంటంటే.. ఆ డ్రైవ్ ఇన్ లో చాలా షాపుల్లో ఓనర్స్ నార్త్ ఇండియన్స్. ఇక సగం మంది వర్కర్స్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుండి వచ్చినవారే. వాళ్ళు మనోడ్ని గుర్తు పట్టడం అంటే ఇతడేమన్నా మహేష్ బాబా? రామ్ చరణా?
తనని ఎవ్వరూ గుర్తుపట్టకపోవడంతో దారుణంగా హర్ట్ అయిన హీరో.. వెంటనే రైయ్ అంటూ అక్కడి నుండి జంప్ అయిపోయాడు. ఇక్కడే ఒక గమ్మత్తయిన విషయం జరిగిందట. కుర్ర హీరో పార్కింగ్ కోసం గోల పెడుతున్నప్పుడు.. కార్లో ఉన్న ఆ హీరోయిన్ను గుర్తు పట్టేసిన కొందరు యువకులు.. ఒక సెల్ఫీ ఇస్తావా అంటూ వచ్చారట. ఆమె కారు అద్దం దించితే ఒట్టు. బాగానే ఉందండీ.. హీరోను గుర్తట్టలేదు కాని.. హీరోయిన్ను గుర్తుపట్టేశారా!!