Begin typing your search above and press return to search.
కుర్రహీరో మటాష్.. బెడిసికొట్టిన బంధం!!
By: Tupaki Desk | 10 Jan 2019 5:30 PM GMTఅక్రమ సంబంధం ఆ కుర్రహీరో కెరీర్ కి థ్రెట్ గా మారిందా? కుర్రచేష్టలు.. చిలిపి చేష్టలు అతగాడికి ఊహించని ముప్పు తెస్తున్నాయా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. మగువతో మెల్లగా మొదలైన స్నేహం హీరోగారి గుండెల్లో కల్లోలం రేపింది. ఆపై అది కాస్తా పెనుబంధంగా మారింది. ఈ పర్యవసానం అతడు అన్నిటా ఓపెన్ అయిపోయాడు. పబ్లిక్ లో పెళ్లయిన పడతి అన్న సెన్స్ లేకుండా చాలానే చేశాడు. కారణం ఏదైనా అది అతడి కెరీర్ పై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. ఏకంగా ఇండస్ట్రీని ఓ డీన్ లా నడిపించే అగ్ర హీరో కోపానికి కారణమైంది. ప్రస్తుతం సదరు కుర్రహీరో అంటే ఆ అగ్ర హీరో భగభగ మండిపోతున్నాడు. ఎంతగా అంటే సందులో దొరికితే తన్నేంత!!
కానీ ఎందుకు ఆగుతున్నాడు? అంటే .. అందుకో కారణం ఉంది. సదరు కుర్రహీరో డాడ్ ఆ అగ్రహీరోకి ఎంతో క్లోజ్ ఫ్రెండ్. తన కెరీర్ లో ఎంతో సాయం చేసిన నిర్మాత కాబట్టి - కాస్త ఆలోచించాడు. నాలుగు తన్నితే కుర్రాడు దారికొస్తాడని భావించినా కానీ - చివరికి అతడి డాడ్ కం నిర్మాతతో రిలేషన్ షిప్ వల్ల వదిలేశాడు కానీ, లేదంటే ఈ పాటికే చాలా పెద్ద చిత్తడి ఇత్తడి అయ్యేదేనన్న మాటా వినిపిస్తోంది. సదరు అగ్ర హీరో కుటుంబానికి చెందిన సన్నిహితులు ఇచ్చిన లీకుల ప్రకారమే ఈ కథనం ప్రచారంలోకి వచ్చింది. ప్రఖ్యాత ఆంగ్ల పత్రికలోనూ అందుకు సంబంధించిన ఓ ఆసక్తికర కథనం వెలువడింది.
తనకంటే సీనియర్ అయిన సదరు పడతితో హీరో గారి ఎఫైర్ ఎంతగా చేటు తెచ్చింది అంటే.. అది కేవలం ఆ కుర్రహీరో కెరీర్ కి ముప్పు తేవడమే కాదు, అతడి తండ్రికి మార్కెట్ వర్గాల్లో ఉన్న క్రెడిబిలిటీపైనా అది పెద్ద రేంజులోనే పంచ్ వేయబోతోందిట. ఆ మేరకు సదరు అగ్ర కథానాయకుడు గేమ్ ప్లాన్ ఛేంజ్ చేశాడన్న మాటా వినిపిస్తోంది. ఆ హీరోని కానీ, అతడి డాడ్ ని కానీ సదరు అగ్ర హీరో అస్సలు వదిలిపెట్టే సమస్యే లేదని చెబుతున్నారు. అయితే అతడు ఇచ్చే ట్రీట్ నేరుగా ఉండదు.. వేరే కోణంలో ఉంటుందిట.
ఇంతటి ముప్పునకు కారణం ఏంటి? అంటే అందుకు బలమైన కారణాలే వినిపిస్తున్నాయి. మొదట ఆ స్టార్ హీరో గారాల చెల్లెలితో డేటింగ్ చేసిన సదరు కుర్రహీరో, తన కుటుంబీకులతో ఎంతో సన్నిహితంగా ఉంటూనే, ఏకంగా తన సోదరుడి భార్యకే ఎర్త్ పెట్టాడు. ఆ పర్యవసానం చాలా తీవ్రంగానే హర్ట్ చేసింది. అంతేకాదు.. తన తమ్ముడి కాపురంలో కలతలు రావడానికి, కల్లోలానికి ఆ కుర్రహీరో కారణం అయ్యాడని సదరు స్టార్ హీరో భావిస్తున్నాడు. అందుకే ఆ కుర్రహీరోని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కే ప్లాన్ లో ఉన్నాడట. అంతేకాదు.. ప్రస్తుతం సదరు కుర్రహీరో తండ్రి తనతో సినిమాలు తీయాలనుకుంటున్నా నో చెప్పేశాడట. ప్రస్తుతం వరుసగా భారీ సినిమాల్లో నటిస్తున్నానని తనతో సినిమాలు చేయడం కుదరదని తెగేసి చెప్పేశాడట. ఇంత జరుగుతున్నా సదరు కుర్రహీరో ఇదేమీ పట్టనట్టు తన పనిలో తాను ఉన్నాడు. సదరు హీరోయిన్ విడాకులు తీసుకున్న తర్వాత ఇంకా పబ్లిక్ అయిపోయాడు. ప్రస్తుతం ఆ ఇద్దరి డేటింగ్ గురించి బాలీవుడ్ లో హోరెత్తిపోతోంది. తొందర్లోనే పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారం చాలానే తేడా కొడుతోందన్న మాటా వినిపిస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ లో ఆ కుర్రహీరోకి - ఆయన డాడ్ కి యాంటీగా మారిన సదరు స్టార్ హీరో కం డీన్ ఎవరో చెప్పాల్సిన పనేలేదు. ఆ కుర్రహీరో ఎవరో - ఎవరితో ఎఫైర్ సాగిస్తున్నాడో, ఆ కుర్ర హీరో డాడ్ ఎవరో అసలే చెప్పనక్కర్లేదు. గెస్ హూ.. ఆర్.. దే!!