Begin typing your search above and press return to search.

యంగ్ హీరో ల‌వ్ బ్రేక‌ప్ అయ్యిందంట‌

By:  Tupaki Desk   |   29 April 2022 3:30 PM GMT
యంగ్ హీరో ల‌వ్ బ్రేక‌ప్ అయ్యిందంట‌
X
యంగ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ స్టైల్ ప్ర‌త్యేకం. వెళ్లిపోమాకే, ఫ‌ల‌క్ నుమా దాస్‌, హిట్‌, పాగ‌ల్ వంటి చిత్రాల‌తో హీరోగా త‌న‌దైన మార్కుని సెట్ చేసుకున్న విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం 'అశోక వ‌నంలో అర్జున క‌ల్యానం'. సూర్య‌పేట యువ‌కుడు.. ఆంధ్రా అమ్మాయి నేప‌థ్యంలో సాగే హిలేరియ‌స్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కించారు. 30 ఏళ్లు దాటినా పెళ్లికాని యువ‌కుడిగా విశ్వ‌క్ సేన్ ఇందులో క‌నిపించ‌బోతున్నారు.

ఏ.్ బార్ అవుతున్నా పిల్ల‌దొర‌క్క ఇబ్బందులు ప‌డే యువ‌కుడిగా విశ్వ‌క్‌సేన్ పాత్ర ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణకు లోని సూర్య‌పేట‌కు చెందిన ఓ యువ‌కుడు త‌న ఫ్యామిలీతో క‌లిసి ఆంధ్రా వెళ్లి అక్క‌డ ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు? .. ఫైన‌ల్ గా పిల్ల దొరికితే పెళ్లైందా?. అమ్మాయి పెట్టిన కండీష‌న్స్ ఏంటీ? అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌.

విశ్వ‌క్‌సేన్ న‌టించిన చిత్రాల‌కు పూర్తి భిన్న‌మైన క‌థ‌, క‌థనాల‌తో రూపొందిన ఈ మూవీని మే 6న విడుద‌ల చేస్తున్నారు. భార ఈ చిత్రాల రిలీజ్ ల కార‌ణంగా ప‌లు ద‌ఫాలుగా రిలీజ్ వాయిదా ప‌డిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మే 6న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ సంద‌ర్భంగా సినిమా రిలీజ్ వారం రోజులే వుండ‌టంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగా హీరో విశ్వ‌క్ సేన్ ఇన్ స్టా వేదిక‌గా వున్న సెల‌బ్రిటీల‌తో ముచ్చ‌టించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోని మేక‌ర్స్ శుక్ర‌వారం విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్‌భంగా విశ్వ‌క్ సేన్ ని ఇన్ స్టా సెల‌బ్రిటీలు ప‌లు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడిగారు. కెరీర్ ప్రారంభించిన నాట నుంచి ప్ర‌తి సినిమాలో మీకొక బ్రేక‌ప్ స్టోరీ వున్న‌ట్టుగా చూపించారు. రియ‌ల్ లైఫ్ లో ఏదైనా బ్రేక‌ప్ స్టోరీ వుందా? అని ప్ర‌శ్నించారు. దీనికి విశ్వ‌క్ సేన్ ఆస‌క్తిక‌రంగా స‌మాధానం చెప్పారు. 'ప్ర‌తి ఒక్క మ‌గాడి లైఫ్ లోని ఏదో ఒక సంద‌ర్భంలో ఇలాంటి క‌థ‌లు వుంటాయి. ప్ర‌తి ఒక్క‌రూఈ ట్రాజెడీకి గుర‌వుతారు. అదే విష‌యాన్ని మేము సినిమాల్లో చూపిస్తున్నాం. అన్నారు.

అంతే కాకుండా ఇక రియ‌ల్ లైఫ్ విష‌యానికి వస్తే నాకొక బ్రేక‌ప్ స్టోరీ వుంది.దాదాపు మూడేళ్ల పాటు ఓ అమ్మాయిని ప్రేమించాను. ఎందుకో తెలియ‌దు ఆమె న‌న్ను వ‌దిలేసింది. అయితే ఆమె న‌న్ను వ‌దిలేసింద‌న్న విష‌యం నాకు నెల‌రోజుల త‌రువాతే తెలిసింది. ఇంత‌కు మించి ఆమె గురించి ఏమీ చెప్ప‌లేను. ఆ విష‌యం త‌లుచుకుంటే ఇప్ప‌టికీ బాధ‌గానే వుంటుంది. అని చెప్పిన విశ్వ‌క్ సేన్ త‌న‌కు కాబోయే భార్య‌కు త‌న‌కంటే ఎక్కువ తెలివి వుండాల‌ని చెప్ప‌డం విశేషం.