Begin typing your search above and press return to search.
యంగ్ హీరో కొత్త వ్యాపారం
By: Tupaki Desk | 4 Dec 2019 3:11 PM GMTహీరో నిర్మాతగా లక్ చెక్ చేసుకుంటున్నాడు సందీప్ కిషన్. 'తెనాలి రామకృష్ణ' చిత్రానికి తనే నిర్మాత. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా నటుడిగా పేరొచ్చింది. ఈ సంతోష సమయంలో తల్లిదండ్రులకు బెంజ్ జిఎల్ఈ 350డి కారును బహుమతిగా ఇచ్చారు.
ఇక సందీప్ ఇటు సినిమాలతో పాటు అటు ఇతర వ్యాపారాల్ని నిర్వహిస్తూ ఎంటర్ ప్రెన్యూర్ అనిపించుకుంటున్నాడు. హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల్లో `వివాహ భోజనంబు` పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని విజయవంతంగా నడిపిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. సందీప్ మరో కొత్త బిజినెస్ లో ప్రవేశించారని తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతిలో త్వరలో ఆయన ఒక సెలూన్ ప్రారంభించనున్నారట. స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తన సొంతం చేసుకున్నారు. త్వరలో సెలూన్ ప్రారంభం కానుందట.
సందీప్ కెరీర్ పరంగా చూస్తే .. తదుపరి సందీప్ హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్ ప్రెస్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. రెండు మూడు కథలు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు చేస్తూ నిర్మాతల హీరోగా కెరీర్ ని మలుచుకునే ఆలోచనతో యంగ్ సందీప్ తెలివైన ప్లాన్ చేస్తున్నాడు.