Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్ పై కండీష‌న్స్ పెడుతున్న యంగ్ హీరో?

By:  Tupaki Desk   |   21 Oct 2022 2:30 AM GMT
బ‌డ్జెట్ పై కండీష‌న్స్ పెడుతున్న యంగ్ హీరో?
X
ఒక సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిందంటే అందులో న‌టించిన హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ విష‌యంలో కండీష‌న్స్ పెట్ట‌డం స‌ర్వ‌సాధార‌ణం. పాక‌రితోషికాలు పెంచ‌డం ప‌రిపాటిగా మారింది. అయితే ఓ యంగ్ హీరో మాత్రం బ‌డ్జెట్ విష‌యంలో కండీష‌న్స్ పెడుతుండ‌టం ఇప్ప‌డు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ హీరో నిఖిల్ న‌టించిన మిస్టీరియ‌స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `కార్తికుయ 2`. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ ల‌పై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించారు.

`కార్తికేయ‌` మూవీకి సీక్వెల్ గా తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లై పాన్ ఇండియా వైడ్ గా అనూహ్య విజ‌యాన్ని సాధించింది. ఉత్త‌రాదిలో క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించిన ఈ మూవీ బాలీవుడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది. రూ. 120 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి మేక‌ర్స్ కి కోట్ల‌ల్లో లాభాల్ని తెచ్చిపెట్టింది. ఒక్క హిందీ వెర్ష‌న్ నుంచే మేక‌ర్స్‌పెట్టిన పెట్టుబ‌డికి మించి ఈ మూవీ రాబ‌ట్టిందంటే ఈ సినిమా వ‌ల్ల ఏ స్థాయి లాభాలు వ‌చ్చాయో అర్థం చేసుకోవ‌చ్చు.

`కార్తికేయ 2`తో ట్రెమండ‌స్ స‌క్సెస్ ని సొంతం చేసుకున్న హీరో నిఖిల్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్థాయిలో 'స్పై' మూవీని చేస్తున్నాడు. యాక్ష‌న్‌ స్పై థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతోంది. ఈ నేప‌థ్యంలో హీరో నిఖిల్ త‌దుప‌రి సినిమాల విష‌యంలో నిర్మాణ విలువలు తనకు పెరిగిన మార్కెట్ కి తగ్గట్టు ఉండాలి అని చెప్తున్నాడు అట . 'కార్తికేయ 2' తో ఊహించ‌ని విజ‌యాన్ని అందుకున్న నిఖిల్ ఆ మాత్రం డిమాండ్ చేయ‌డంలో త‌ప్పులేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

అయితే ఈ మూవీ త‌రువాత చేయ‌బోయే సినిమా తన మార్కెట్ కి తగ్గ బ‌డ్జెట్ కు ఏమాత్రం త‌గ్గ‌కుండా వుండాల‌ని నిఖిల్ డిమాండ్ చేస్తుండ‌ట‌మే ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారుతోంద‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే భారీ స్పాన్ వున్న క‌థ‌ల‌ని నిఖిల్ వింటున్నాడ‌ట‌. అంతే కాకుండా ఇప్ప‌టికే పూర్త‌యి రిలీజ్ కి రెడీ గా వున్న '18 పేజెస్‌' ని కూడా రీ షూట్ చేయిస్తున్నాడ‌ని, కొన్ని భారీ మార్పులు చెబుతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.