Begin typing your search above and press return to search.
బంపర్ ఛాన్స్.. వాడుకుంటాడా?
By: Tupaki Desk | 13 Aug 2022 6:04 AM GMTయువ కథానాయకుడు నిఖిల్ కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమాల్లో ఒకటిగా కార్తికేయ-2ను చెప్పొచ్చు. నిఖిల్ కెరీర్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కడమే కాదు.. అత్యధిక సమయం చిత్రీకరణ జరుపుకుని.. అత్యధిక అంచనాలతో రిలీజవుతోంది. రకరకాల కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు శనివారం రిలీజవుతోంది.
మామూలుగా కొత్త చిత్రాలు శుక్రవారమే రిలీజవుతుంటాయి. అలా కాదంటే ఇంకా ఒక రోజు ముందుగా కూడా థియేటర్లలోకి దిగుతుంటాయి. కానీ 'కార్తికేయ' మాత్రం శనివారం వస్తోంది. కొంత అయిష్టంగానే ఆ రోజును ఎంచుకుంది చిత్ర బృందం. వేరే సినిమాలకు పోటీ అవుతుందని గతంలో వేరే డేట్ల నుంచి సినిమాను తప్పించిన కొందరు సినీ పెద్దలు.. శుక్రవారం రిలీజైన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి పోటీ అవుతుందని మళ్లీ ఒక రోజు వెనక్కి పంపించారుఈ చిత్రాన్ని. ఈ విషయంలో నిఖిల్ పట్ల సానుభూతి వ్యక్తమైంది అందరి నుంచి.
ఐతే అంతా మన మంచికే అన్నట్లు ఒక రోజు లేటవడం వల్ల నిఖిల్ సినిమాకు వచ్చిన నష్టమేమీ లేదనే చెప్పాలి. శుక్రవారం విడుదలైన 'మాచర్ల నియోజకవర్గం' డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా వీకెండ్‌ను ఎంతమాత్రం ఉపయోగించుకునేలా కనిపించడం లేదు.
దాని దూకుడంతా తొలి రోజు మార్నింగ్ షోలకే పరిమితం. ఇక ఈ వారం రిలీజైన మరో సినిమా 'లాల్ సింగ్ చడ్డా' ఫస్ట్ షో నుంచే పడుకుంది. ఆ సినిమాకు షోలు వేస్తే ఎదురు డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి.
కాబట్టి ఈ వీకెండ్లో 'కార్తికేయ-2'కు పోటీయే లేనట్లు భావించాలి. గత వారం రిలీజైన సీతారామం, బింబిసార రెండో వారంలో కూడా బాగా ఆడుతున్నాయి. గురు, శుక్రవారాల్లో రిలీజైన సినిమాలకు వచ్చిన నెగెటివ్ టాక్ వాటికి ప్లస్ అయింది. ఐతే 'కార్తికేయ-2'కు పాజిటివ్ టాక్ వస్తే ఆటోమేటిగ్గా జనాలు కొత్త సినిమా చూడ్డానికే మొగ్గు చూపుతారు.
'బింబిసార' కూడా ఫాంటసీ టచ్ ఉన్న థ్రిల్లర్ మూవీ కావడం వల్ల 'కార్తికేయ-2'కు బెటర్ టాక్ వస్తే.. దాన్నుంచి ప్రేక్షకులు ఇటు మళ్లుతారు. అప్పుడు నిఖిల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తుంది. సోమవారం ఇండిపెండెన్స్ డే సెలవు కూడా ఉంది కాబట్టి శుక్రవారాన్ని మిస్సయ్యామని ఫీలవ్వాల్సిన పని కూడా లేదు. కావాల్సిందల్లా సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండడం, పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే.