Begin typing your search above and press return to search.

త్యాగాలు మొదలెట్టేశావా కుర్ర హీరో?

By:  Tupaki Desk   |   15 Nov 2016 7:30 PM GMT
త్యాగాలు మొదలెట్టేశావా కుర్ర హీరో?
X
సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పేస్తూ ఉంటారు. కానీ సినిమా దగ్గరకు వచ్చేసరికి పోటీ పడిపోతుంటారు.. పోటీలు పడి రిలీజ్ డేట్స్ ఇస్తూ ఉంటారు. ఒకరకంగా ఇది ఆరోగ్యకరమైన పోటీనే అని చెప్పాలి. కానీ ఓ కుర్ర హీరో మాత్రం అప్పుడే త్యాగాలు మొదలెట్టేసి.. నెత్తి మీదకు తెచ్చేసుకుంటున్నాడు.. తన సినిమాని సమస్యల్లో నెట్టేసుకుంటున్నాడు.

ఈ కుర్రాడు తన కొత్త సినిమాని ఓ నెల్లాళ్ల క్రితమే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ తన స్నేహితుడైన దర్శకుడి కోసం వాయిదా వేసుకున్నాడని టాక్. ఆ డైరెక్టర్ తీసిన రీమేక్ మొన్న దసరాకి వచ్చి సక్సెస్ కూడా సాధించేసింది. ఆ సినిమాతో పోటీగా రిలీజ్ చేయద్దని ముందే నిర్మాతలను కోరాడు ఈ కుర్రాడు.. ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యేసరికి.. మొత్తం ఇండస్ట్రీనే స్లంప్ లో పడిపోయింది.

కరెన్సీ నోట్ల ఇష్యూ సినిమా రంగంపై విపరీతంగా ఎఫెక్ట్ చూపించేస్తోంది. 'ఎక్కడైనా బావ కానీ..' అనే సామెతను ఈ కుర్రాడు నేర్చుకోవాలని.. లేకపోతే ఇలాంటి త్యాగాలు కెరీర్ నే ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయని సలహాలు ఇస్తున్నారట సీనియర్లు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/