Begin typing your search above and press return to search.
పబ్బులో హడావుడి చేసిన యంగ్ హీరో!
By: Tupaki Desk | 3 Jun 2018 4:23 AM GMTదాదాపు పది.. పదిహేను రోజుల క్రితం జరిగిన ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిన్న ఉదంతంగా పలువురు భావిస్తున్న ఈ వైనం ఇప్పుడు మీడియాలోకి వచ్చేసింది. గడిచిన ఒకట్రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఉదంతంలో యంగ్ హీరో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం (మే 22న) ఫ్యాట్ పిజియన్ పబ్ కు హీరో వెళ్లారు. ఆయనతో పాటు ఆయన స్నేహితులు కొందరు ఉన్నట్లు చెబుతున్నారు. రాత్రి 11.30 గంటల వేళలో డీజే సౌండ్ తగ్గించారు. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో సౌండ్ పెంచాలని డిమాండ్ చేయటం.. దీనికి నో అన్నందుకు ఆగ్రహంతో డీజే స్పీకర్లు పగులగొట్టినట్లుగా చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పబ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హీరో భిన్నమైన వాదనను వినిపించినట్లుగా చెబుతున్నారు. తాను ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేశానని.. పబ్ లో డీజే మోత ఎక్కువగా ఉందని.. దాన్ని తగ్గించాలని కోరినట్లుగా చెప్పారు. తమకు అందిన సమాచారానికి భిన్నమైన వాదనను యంగ్ హీరో వ్యక్తం చేయటంతో సీసీ కెమేరా పుటేజ్ ను తమకు అందివ్వాలని పబ్ యాజమాన్యాన్ని పోలీసులు కోరినట్లుగా చెబుతున్నారు.
ఈ ఘటనను మరింత పెద్దది కాకుండా ఉండేందుకు కొందరు మధ్యవర్తులు రంగంలోకి దిగటంతో.. హీరో తీరుపై పబ్ యాజమాన్యం కంప్లైంట్ చేయలేదని చెబుతున్నారు. దీంతో.. ఈ వ్యవహారంపై కేసు నమోదు కాలేదు. కాకుంటే.. జనరల్ డైరీలో మాత్రం ఈ ఘటన జరిగినట్లుగా నమోదు చేశారు. ఎప్పుడూ వివాదాల్లో కనిపించని ఆ యంగ్ హీరో పేరు ఈసారి అందుకు భిన్నంగా బయటకు రావటం ఆసక్తికరంగా మారింది.