Begin typing your search above and press return to search.
అవి విఫలమైతే టిల్లు మ్యాజిక్ చేయడం కష్టమే?
By: Tupaki Desk | 15 Nov 2022 2:30 AM GMTకొన్ని సినిమాలు ఎందుకు బ్లాక్ బస్టర్ లవుతాయో అర్థం కాదు.. కానీ కొనప్ని ఎలా.. ఎందుకు.. ఏ అంశాలు ప్రధాన పాత్ర పోషించి ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబెట్టాయో మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అన్నీ కరెక్ట్ గా కలిసి రావడంతో ఓ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది.. అదే అనూహ్యంగా సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ ని చేస్తుంది. అలాంటి మ్యాజిక్ జరిగిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మూవీ `డీజే టిల్లు`. సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ఈ మూవీ భారీ సినిమాల మధ్య ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై చిన్న సినిమాల్లో భారీ విజయాన్ని సాధించింది.
ఈ సినిమా సక్సెస్ విషయంలో మ్యిజిక్ చేసిన అంశాలు చాలానే వున్నాయి. హీరో సిద్ధూ జొన్నలగడ్డ క్యారెక్టర్ ని మలిచిన తీరు, సిద్ధూ జొన్నలగడ్డ అందించిన మాటలు, దర్శకుడు విమల్ కృష్ణ టేకింగ్, రాధిక పాత్రలో తనదైన మార్కు నటనతో నెగెటివ్ రోల్ లో నటించిన సినిమాని కీలక మలుపులు తిప్పిన నేహా శెట్టి, రామ్ మిర్యాల సంగీతం అందించి పాడిన డీజై టైటిల్ సాంగ్, తమన్ నేపథ్య సంగీతం, శ్రీచరణ్ పాకాల ఆడియో.. బ్రహ్మాజీ క్యారెక్టర్.. ఇలా అన్నీ సమపాళ్లలో కలిసి మ్యాజిక్ చేశాయి.
దీంతో ఊహించని విధంగా `డీజే టిల్లు` బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవడమే కాకుండా రూ. 50 కోట్ల మేర వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. రీసెంట్ గా దీనికి సీక్వెల్ అంటూ `టిల్లు స్క్వేర్`ని మొదలు పెట్టాడు సిద్ధూ జొన్నలగడ్డ. హీరో, మేకర్స్ సేమ్. కానీ డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారు. రాధికగా నటించి సినిమాకు ప్రధాన బలంగా నిలిచిన నేహాశెట్టి ఇందులో లేదు. తన స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ని దించేశారు.
తనలా అనుపమ మ్యాజిక్ చేయడం కష్టమే. ఇక దర్శకుడిగా విమల్ కృష్ణని తప్పించారు. ఆ స్థానంలో మల్లిక్ రామ్ వచ్చి చేశాడు. తన మేకింగ్, సిద్దూ జొన్నలగడ్డతో ఎలా మింగిల్ అవుతాడన్నది కొంత అనుమానంగానే వుంది. ఇక మూడవది `డీజే టిల్లు` టైటిల్ సాంగ్ ఇచ్చిన రామ్ మిర్యాల ఈ మూవీకి మొత్తానికి సంగీత దర్శకుడు. ఇక నేపథ్య సంగీతంతో హైప్ ఇచ్చిన తమన్ ఈ మూవీకి పని చేయడం లేదు. ఇది కూడా ఓ మైనస్ గా మారే అవకాశం వుంది.
డీజే ఇచ్చిన సక్సెస్ తో అప్పుడే సిద్దూ జొన్నలగడ్డ సీక్వెల్ టైటిల్ కార్డ్స్ లో స్టార్ బోయ్ అని ట్యాగ్ తగిలించుకున్నాడు. రాధిక క్యారెక్టర్ నుంచి తమన్ వరకు అన్ని శాఖలు మ్యాజిక్ చేయడంతో `డీజే టిల్లు` బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
మరి `టిల్లు స్కేర్` కు అవే మైనస్ గా కనిస్తున్నాయి. ఈ నేఫథ్యంలో స్టార్ బోయ్ సిద్దూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో మ్యాజిక్ చేస్తాడంటే కష్టమే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై స్టార్ బోయ్ సిద్దూ జొన్నలగడ్డ ఎలాంటి రిజల్ట్‌ని అందిస్తాడో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.