Begin typing your search above and press return to search.

అన్నట్లుగానే పెళ్లి పీఠలు ఎక్కబోతున్న యంగ్ హీరో

By:  Tupaki Desk   |   16 Jan 2021 10:57 AM GMT
అన్నట్లుగానే పెళ్లి పీఠలు ఎక్కబోతున్న యంగ్ హీరో
X
గత ఏడాది పలువురు టాలీవుడ్ హీరోలు పెళ్లి పీఠలు ఎక్కారు. అయితే బాలీవుడ్ హీరోలు మాత్రం పెళ్లి ఆలోచన ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. ఆమద్య రణబీర్ కపూర్ మాట్లాడుతూ కరోనా లేకుంటే ఈ ఏడాది పెళ్లి చేసుకునే వాళ్లం. కాని కరోనా కారణంగా వచ్చే ఏడాదికి పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నాడు. మరో బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ఇటీవల తన సినిమా ప్రమోషన్‌ సందర్బంగా మాట్లాడుతూ అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2021 ఆరంభంలో పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే ఈనెల 24న వరుణ్‌ ధావన్‌ పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు.

వరుణ్‌ ధావన్ కొన్నాళ్లుగా నటాసా దలాల్ ను ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి పెళ్లి అందరికి తెలిసిన విషయమే. రెండు వైపుల వారు కూడా మాట్లాడుకుని ఈనెల 24న పెళ్లిని ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. ముంబయిలోని అలీ బాగ్‌ లో రిసార్ట్‌ లో పెళ్లి వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు అక్కడ పెళ్లి వేడుకలు నిర్వహించేలా ప్లాన్‌ చేశారట. బాలీవుడ్‌ కు చెందిన పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం అందింది.

ఈమద్య కాలంలో బాలీవుడ్‌ లో ఎలాంటి పెద్ద వేడుక జరగలేదు. గత ఏడాది కరోనా లాక్ డౌన్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ వివాహం జరుగుతుంది. కనుక పెద్ద ఎత్తున బాలీవుడ్‌ ప్రముఖులు హాజరు అయ్యే అవకాశం ఉంది. సల్మాన్‌ ఖాన్‌ కు ప్రత్యకంగా వరుణ్‌ ధావన్‌ ఆహ్వానం అందించే అవకాశం ఉంది. బాలీవుడ్ స్టార్స్‌.. సూపర్‌ స్టార్స్ పలువురు ఈ వివాహ మహోత్సవంకు హాజరు అవ్వబోతున్నారు.