Begin typing your search above and press return to search.
ఫోకస్: యువహీరోల్లో రేసింగ్ హీరోలు
By: Tupaki Desk | 18 Aug 2015 6:00 PM GMTహీరో అయిపోవడం అంటే అంత వీజీ కాదు. దానికి బోలెడంత పట్టుదల, కృషి, ప్రయత్నం కావాలి. అదంతా ఉన్నా బ్యాకప్ ఇచ్చేవాళ్లు కూడా అవసరం. గైడెన్స్ లేనిదే ఇక్కడ ఎదగడం చాలా కష్టం. ఫ్యామిలీ హీరోలు రాజ్యమేలుతున్న ఈ ప్రపంచంలో మేం కూడా రేసులోనే ఉన్నాం అని నిరూపించుకోవాలంటే దానికి తగ్గ చైన్ లింక్స్ సరిగ్గా కుదరాలి. అయితే ఇప్పుడున్న హీరోల్లో యువతరంలో నలుగురి పేర్లు ఫిలింనగర్ లో ఆల్ టైమ్ హాట్ టాపిక్. నాని, నిఖిల్, ఆది, సందీప్ కిషన్ ఈ నలుగురూ పరిశ్రమలో నిలదొక్కుకోగలిగారన్న టాక్ నడుస్తోంది.
ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మాస్ రాజా రవితేజలా హీరో అవ్వగలిగాడు నాని. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అనూహ్యంగా హీరో అయ్యాడు. కెరీర్ ఆరంభమే చెప్పుకోదగ్గ విజయాలు రావడం తనకి ప్లస్. అయితే కెరీర్ లో కష్టనష్టాల్ని, ఎత్తు పల్లాల్ని తెలివిగా బ్యాలెన్స్ చేయగలిగాడు కాబట్టే బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా హీరోగా నిలబడ్డాడు. గెలుపు లో ఉన్నప్పుడు ఎవరూ ఏమీ అనరు కానీ, ఫ్లాపుల్లో ఉన్నప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సిందే. అలాంటివన్నీ చూసిన నాని తనకంటూ ఓ సెలక్షన్ ఉందని, హిట్ ఫార్ములా ఉందని ఇటీవలి కాలంలో నిరూపించాడు.
అలాగే రేసులో దూసుకుపోతున్న మరో హీరో నిఖిల్. రవితేజ, నాని తర్వాత అదే బాటలో హీరోగా ఎదుగుతున్నాడు. శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ తో నలుగురిలో ఒకడిగా పరిచయమైనా, తర్వాత తనకంటూ ఓ గుర్తింపు, ఇమేజ్ తెచ్చుకుని హీరోగా కొనసాగుతున్నాడు. విలక్షణమైన కథాంశాల్ని ఎంచుకుని హిట్ మీద హిట్టు కొడుతున్న హీరోగా నిఖిల్ కి గుర్తింపు వచ్చింది. సినిమా ఫ్యామిలీ నుంచి పరిశ్రమకి రాకపోయినా తనదైన ప్రతిభతో నెగ్గుకొస్తున్నాడు. ఇటీవలే హ్యాట్రిక్ విజయాలతో సక్సెస్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పటికిప్పుడు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ఇదంతా తనంతట తానుగా తయారు చేసుకున్న సామ్రాజ్యం. ఏది హిట్టు కథ, ఏది ఫట్టు కథ తెలుసుకుని తెలివైన ఎంపికలతో, తనని తాను తీర్చిదిద్దుకుంటూ ముందడుగు వేస్తున్నాడు.
హీరో ఆదికి నట వారసత్వం ఉంది. కుటుంబమంతా సినిమాకే అంకితం. తండ్రి సాయికుమార్ హీరో కం డబ్బింగ్ ఆర్టిస్టు. తనకి ఉన్న కాంటాక్ట్స్ తో ఆదికి హీరో అవ్వడం ఈజీనే అయ్యింది. అయితే ఆ తర్వాత మాత్రం సొంత ట్యాలెంటుతో ఎదుగుతున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవర్ నైట్ స్టార్ డమ్ రాకపోయినా తనకంటూ ఓ మార్కెట్ ఉంది అని నిరూపించుకున్నాడు. పరిమిత బడ్జెట్ సినిమాలు, తెలివైన ఎంపికలతో ముందుకెళుతున్నాడు. అయితే ఇటీవలి కాలంలో సక్సెస్ దోబూచులాడుతోంది. కథల ఎంపికలో ఆది తడబాటు కనిపించింది. వీటన్నిటినీ సవరించుకుని ఇప్పుడు కొత్త ఎత్తుగడతో దూసుకొస్తున్నాడు.
సందీప్ కిషన్ కి నటవారసత్వం లేదు. కేవలం మామ సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు అన్న అండ దండ తప్ప ఇంకేమీ లేదు. అయినా నటుడిగా రాణిస్తున్నాడు. కొన్ని తప్పటడుగులు వేసినా మొట్టికాయ వేసి సరిచేయడానికి ఛోటా మామ ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ హిట్ కొట్టాక అతడికి తిరుగులేని స్థానం దక్కింది. ఎప్పటికప్పుడు నటనలో మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తనకంటూ ఓ బుల్లి ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని అక్కడ ఎదగాలని తాపత్రయ పడుతున్నాడు.
డజను పైగానే యువతరం హీరోలు ఉన్నా.. ఈ నలుగురే రేసులో తెలివిగా ముందడుగేస్తున్నారు.