Begin typing your search above and press return to search.

యంగ్ విలన్ లుగా కుమ్మేస్తున్నారు..

By:  Tupaki Desk   |   4 May 2016 4:15 AM GMT
యంగ్ విలన్ లుగా కుమ్మేస్తున్నారు..
X
సినీ ఇండస్ట్రీలో యంగ్ విలన్ ల ట్రెండ్ స్పీడ్ అందుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడులో.. ఆది పినిశెట్టి విలన్ రోల్ లో విపరీతంగా ఆకట్టుకోవడంతో.. మళ్లీ ఈ యంగ్ విలన్ కాన్సెప్ట్ జోరందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఆదికి విపరీతంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

సరైనోడు తర్వాత వారానికే నారా రోహిత్ మూవీ రాజా చెయ్యి వేస్తేలో.. నందమూరి కుర్రాడు తారకరత్న విలన్ గా అలరించాడు. తారకరత్న ఇలా విలన్ రోల్ చేయడం ఇదేమీ మొదటి సారి కాకపోయినా.. ట్రెండ్ లో కరెక్ట్ సెట్ అయిపోయాడు. వీరిద్దరి కంటే ముందే గతేడాది కళ్యాణ్ రామ్ పటాస్ లో చరణ్ దీప్ యంగ్ విలన్ గా విపరీతమైన పేరు సంపాదించుకున్నాడు. జిల్ తో పరిచయమైన కబీర్ దుహాన్ సింగ్ కు.. విలన్ గా విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది.

రీసెంట్ గా టాలీవుడ్ హీరో సుధీర్ బాబు కూడా.. బాఘీ చిత్రంతో బాలీవుడ్ లో విలన్ గా అరంగేట్రం చేసేశాడు. అందరి గురించి చెప్పుకుని దగ్గుబాటా రాణా గురించి మాట్లాడకపోతే అసలు ఆర్టికల్ కి న్యాయం జరగదు. బాహుబలి చిత్రంలో భల్లాలదేవుడిగా రాణా చేసిన పాత్ర.. సినిమాలో ప్రభాస్ తర్వాత హైలైట్.

వీరే కాకుండా.. లెజెండ్ మూవీతో జగపతి బాబు, తని ఒరువన్ తో అరవింద్ స్వామి, రోబో సీక్వెల్ తో అక్షయ్ కుమార్ లు కూడా విలన్స్ గా మారిపోయారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కూడా విలన్ అవతారం ఎత్తుతున్నాడు. వీళ్లు యంగ్ కాకపోయినా.. విలన్ రోల్స్ కి మాత్రం కొత్తే. మొత్తానికి ఇండస్ట్రీలో విలన్ రోల్స్ లో కొత్త ట్రెండ్ మొదలైపోయింది.