Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీలో పెరిగిపోతున్న రుద్దుడు హీరోలు...!
By: Tupaki Desk | 27 April 2020 12:30 AM GMTటాలీవుడ్లో వారసుల హవా ఈనాటిది కాదు. నిజానికి మన హీరోలలో చాలామంది ప్రముఖ సినీ కుటుంబాలకు సంబంధించిన వారసులే. అయితే వారసులలో చాలామంది తమ హార్డ్ వర్క్ తో.. యాటిట్యూడ్ తో ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా మిగతా వారు మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేక పోతున్నారు . నిజానికి బ్యాక్ అప్ లేకపోతే వీళ్లకు ఒక్క ఛాన్స్ కూడా రాదని అటు ఇండస్ట్రీలో ఒక సాధారణ ప్రజల్లో కూడా టాక్ ఉంది. నిజాలు ఎప్పుడు చేదుగా ఉంటాయి కాబట్టి ఇది కూడా అ చాలామందికి చేదుగా అనిపించే అవకాశం ఉంది. ఈ హీరోలను చాలామంది రుద్దుడు హీరోలుగా పిలుచుకుంటున్నారు.
ఈ బ్యాచ్ అంతా గజిని తరహాలో ప్రేక్షకులపైకి దండయాత్రలు చేస్తూ ఉండడంతో చేసేదేమి లేక వీరి సినిమాలు కొంతవరకు ప్రేక్షకులు చూస్తున్నారు. వీరిలో కొంతమందికి కొంత మేరకు సక్సెస్ కూడా ఉంది. సక్సెస్ ఉన్న డబ్బు ఉన్నా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. సరిగ్గా నిలదొక్కుకోలేక పోతున్నారు ఈ హీరోలు. సదరు ఫ్యామిలీ నీ హీరోల అభిమానులు వీరిని వెనకేసుకుని రావొచ్చు కానీ న్యూట్రల్ గా చూస్తే మాత్రం వీరిని రుద్దుడు హీరోలు అని చెప్పక తప్పదు. అల్లు శిరీష్.. అఖిల్.. సుశాంత్.. సుమంత్.. రక్షిత్.. కార్తికేయ.. హవీష్.. కళ్యాణ్ రామ్.. నవీన్ (నరేష్ కుమారుడు).. సుమంత్ అశ్విన్.. ఆది సాయి కుమార్.. ఆనంద్ దేవరకొండ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది ఉంది. సక్సెస్ అనేది 10 శాతమే ఉన్న ఈ సినీ పరిశ్రమలో నిజానికి ఈ హీరోలకు బ్యాక్ గ్రౌండ్ లేకపోతే..ఈ పాటికి ఎప్పుడో మూటాముల్లె సర్దుకోవాల్సి వచ్చేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నిజానికి టాలీవుడ్ లో పెద్ద స్టార్లు అయిన మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. ప్రభాస్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్.. వీరందరూ సినీ కుటుంబాల వారసులే. కానీ కష్టపడి.. ప్రేక్షకులు నచ్చే మెచ్చే సినిమాలు చేస్తూ స్టార్ హీరోలుగా ఎదిగారు. ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. మరి ఈ హీరోలలో ఉన్నది ఏంటి ఆ రుద్దుడు హీరోలలో లేనిది ఏంటి అనేది వారే ఆలోచించుకోవాలి.. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రస్తుతం నెలకొన్న సినీ పరిశ్రమ సంక్షోభంలో ఈ రుద్దుడు హీరోలకు మరింత కష్టకాలం వచ్చినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.