Begin typing your search above and press return to search.
సమ్మర్ ని టార్గెట్ చేస్తున్న యంగ్ హీరోలు..!
By: Tupaki Desk | 7 Jan 2021 5:30 PM GMTకోవిడ్ నేపథ్యంలో ఇన్నాళ్లూ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో సినిమాలను రిలీజ్ చేస్తూ వచ్చిన మేకర్స్.. ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అవడంతో థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల కాగా సంక్రాంతికి మరో నాలుగు సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటికి ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ని బట్టి మరికొన్ని సినిమాలు థియేట్రికల్ విడుదలకు సిద్ధం చేయనున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం సమ్మర్ ని టార్గెట్ గా పెట్టుకున్నారని తెలుస్తోంది.
కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చాలా సినిమాలు రాబోయే సమ్మర్ సీజన్ లోనే విడుదల కానున్నాయి. అప్పటికి 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి కూడా అనుమతి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ - పూజాహెగ్డే జంటగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు - వాసు వర్మ నిర్మిస్తున్నారు.
అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి కలిసి నటించిన 'లవ్ స్టొరీ' చిత్రం కరోనా కారణంగా షూటింగ్ లేట్ అవడంతో ఇప్పుడు వేసవిలోనే రావాలని చూస్తోందట. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మిస్తున్నారు. అలానే యువ హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వరుడు కావలెను' కూడా వేసవి సెలవులనే నమ్ముకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్నారు.
మెగా హీరో సాయి తేజ్ - దర్శకుడు దేవకట్టా కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాని కూడా వేసవికి రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. యూత్ స్టార్ నితిన్ నటించిన 'రంగ్ దే' చిత్రాన్ని మార్చి చివరి వారంలో విడుదల చేస్తున్నారు. అలానే యువ హీరో సందీప్ కిషన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా 'ఏ1ఎక్స్ ప్రెస్' ని సమ్మర్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న 'సూపర్ మచ్చి' సినిమా కూడా అప్పుడే రానుంది. కార్తికేయ హీరోగా నటిస్తున్న 'చావు కబురు చల్లగా' సినిమాని ఏప్రిల్ లో విడుదల చేయాలని గీతా ఆర్ట్స్2 టీమ్ ప్లాన్ చేస్తుందని సమాచారం. అలానే పంజా వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' మరియు క్రిష్ సినిమాలలో ఒకటి సమ్మర్ లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కొన్ని రాబోయే రోజుల్లో యంగ్ హీరోల సినిమాల విడుదలలో మార్పులు ఉంటాయేమో చూడాలి.