Begin typing your search above and press return to search.
టాలీవుడ్ రొమాన్స్ అంటే వేధింపులేనా?
By: Tupaki Desk | 13 April 2016 7:30 AM GMTసినిమాలంటే రొమాన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా కుర్ర హీరోల సినిమాలు - లవ్ స్టోరీలంటే రొమాన్స్ ఉండకపోతే.. సీన్స్ పండవు. ఇక పాటల్లోనూ తమ రొమాంటిక్ ట్యాలెంట్ ని ప్రదర్శించేస్తూ ఉంటారు. తాజాగా విడుదలైన కొన్ని సినిమాల్లో పాటలు వింటుంటే.. ఇది రొమాన్సా - వేధింపుల పర్వమా (స్టాకింగ్) అనిపించక మానదు అంటున్నారు సైకాలజీ నిపుణులు.
అల్లు అర్జున్ మూవీ సరైనోడులో... 'చంపేత్తే చంపెయ్యే - కుమ్మేత్తే కుమ్మెయ్యే - ఐనా నను లవ్ చెయ్యే' అంటూ ఓ పాట సాగుతుంది. అంటే హీరోయిన్ ఫీలింగ్స్ తో ఏ మాత్రం పని లేకుండా హీరోని ప్రేమించెయ్యాలన్న మాట. దీనికి ముందు ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రంలో 'ఐ వానా ఫాలో ఫాలో ఫాలోయూ' అంటూ సాగే పాట తీరు కూడా ఇంతే. 'సెల్ ఫోన్ ని సిగ్నల్ ఫాలో చేసినట్లు నిన్ను నేన ఫాలో చేస్తూనే ఉంటా' అంటాడు హీరో.
ఇక వరుణ్ తేజ్ మూవీలో లోఫర్ లో అయితే 'నువ్వేడుస్తుంటే నచ్చినావే పిల్లా నాకు' అని పాటేస్కుంటాడు హీరో. ఇలాంటివి టీనేజ్ కుర్రకారుపై ప్రభావం చూపుతాయని.. ఫిలిం మేకర్స్ సమాజంపై బాధ్యతగా ఉండాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. లేకపోతే ఇలా వేధింపులు, ఏడిపించడమే రొమాన్స్ అనుకునే ప్రమాదం ఉంది అంటున్నారు విశ్లేషకులు.