Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూసివ్:అప్పుడే యాటిట్యూడ్ చూపుతున్న కొత్తమ్మాయి
By: Tupaki Desk | 2 Aug 2017 5:39 AM GMTలక్ కొద్దీ గుర్తింపు వచ్చింది. యావరేజ్ లుక్ ఉన్నా యాక్షన్ బాగుండటంతో ప్రేక్షకులు ఆదరించారు. దీంతో తనకి తిరుగులేదనుకుంటున్న ఆ కొత్త అమ్మడు - దర్శకనిర్మాతలకి చుక్కలు చూపించడం స్టార్ట్ చేసిందని ఫిల్మ్ నగర్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. కేవలం ఒక్క సినిమాతోనే తాను నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయినట్లుగా ఆ ముద్దుగుమ్మ బిహేవ్ చేస్తుందని కొందరు సినీ జనాలు అంటున్నారు. సెట్ కి టైమ్ కి రావడం లేదని, లేట్ గా వచ్చి చాలా నిదానంగా ఉంటూ యూనిట్ సమయాన్ని వృధా చేస్తుందని ఆ న్యాచురల్ బ్యూటీ పై అప్పుడే ఫిర్యాదులు మొదలైయ్యాయి.
ఇటీవలే ఆ బ్యూటీకి హిట్ రావడంతో వరుస ఆఫర్లు ఆమెను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంతోనే ఆ హీరోయిన్ ట్రాక్ మార్చిందని దర్శకనిర్మాతల వాదన. ప్రస్తుతం రైజింగ్ లో ఉన్న ఓ యంగ్ హీరో తో ఆ బ్యూటీ ఓ సినిమా కమిటైంది. అలానే లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న మరో హీరో సినిమాలో కూడా ఆ బ్యూటీ నటిస్తుంది. ఈ రెండు సినిమాలు తరువాత మరో మూడు సినిమాలు ఆమె ఖాతలోకి వచ్చిపడ్డాయి. అయితే ఇందులో ఎన్ని సెట్స్ పైకి వెళతాయో ఇంకా క్లారిటీ లేదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఇండస్ట్రీలో లాంగ్ రన్ చేయాలంటే కాస్త దూకుడు తగ్గిస్తేనే మంచిదనే టాక్ ఉంది. మరి ఈ నిజాన్ని త్వరగా గ్రహించి తన పై వస్తున్న కామెంట్స్ కు ఆ బ్యూటీ ఓ ఫుల్ స్టాప్ పెడుతుందేమో చూద్దాం.