Begin typing your search above and press return to search.

ఫ్యామిలీతో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న యంగ్ హీరోయిన్..!!

By:  Tupaki Desk   |   13 Aug 2020 3:30 PM GMT
ఫ్యామిలీతో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న యంగ్ హీరోయిన్..!!
X
'అఖిల్' సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలోకి హీరోయినుగా తెరంగేట్రం చేసింది ముంబై భామ సాయేషా సైగల్. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులకు కూడా సాయేషా సుపరిచితమే. అయితే తన మొదటి సినిమా అఖిల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. ఆ సినిమా ప్రభావం సాయేషా టాలీవుడ్ కెరియర్ పై పెద్ద దెబ్బే కొట్టింది. ఇక ఆ సినిమా తర్వాత సాయేషా మళ్లీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేకపోయింది. అంతకుమించి అమ్మడికి తెలుగు పరిశ్రమ నుండి హీరోయినుగా ఎలాంటి అవకాశాలు రాలేదు. కానీ తమిళంలో మాత్రం అమ్మడు వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. నిజానికి సాయేషా స్వతహాగా క్లాసికల్ డాన్సర్. కథక్, ఒడిస్సీ, లాటిన్, అమెరికన్.. ఇలా చాలా రకాల డాన్సుల్లో శిక్షణ తీసుకుందట. డాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే.. అనుకోకుండా హీరోయిన్ అయ్యిందట ఈ బ్యూటీ.

ఇక లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం అయిన హీరోయిన్‌ సాయేషా సైగల్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. గత ఏడాది మార్చి నెలలో హీరో ఆర్యని సాయేషా ప్రేమించి.. ఇంట్లో వాళ్లను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది. ఈరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటుంది సాయేషా. ఫ్యామిలీతో కలిసి పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని.. అలాగే తనను విష్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ అంటూ సోషల్ మీడియాలో ఫ్యామిలీతో దిగిన ఫోటోలు పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ అమ్మడు టెడ్డీ అనే తమిళ సినిమాలో హీరోయినుగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో భర్త ఆర్యనే హీరో కావడం విశేషం. అలాగే ఇటీవలే సాయేషా యువరత్న అనే కన్నడ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అంటే ఈ ఏడాది సాయేషా కన్నడ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టనుంది. చూడాలి మరి సాయేషా కెరీర్ ఎలా ఉండబోతుందో..!!