Begin typing your search above and press return to search.

KWAN ట్యాలెంట్ ఏజెన్సీ ని వ‌దిలి క‌ర‌ణ్‌ DCA లో చేరుతున్న యంగ్ హీరోయిన్లు!

By:  Tupaki Desk   |   11 Sep 2021 1:30 AM GMT
KWAN ట్యాలెంట్ ఏజెన్సీ ని వ‌దిలి క‌ర‌ణ్‌ DCA లో చేరుతున్న యంగ్ హీరోయిన్లు!
X
ముంబైకి చెందిన ప్ర‌ఖ్యాత క్వాన్ మేనేజ్ మెంట్ బాలీవుడ్ స‌హా ప‌లు సినీరంగాల్లో గొప్ప పాపులారిటీని క‌లిగి ఉన్న సంగ‌తి తెలిసిందే. క్వాన్ ట్యాలెంట్ మేనేజ్ మెంట్ కి ముంబై- దిల్లీ స‌హా హైదరాబాద్ లోనూ ఆఫీస్ లు ఉన్నాయి. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ ప‌రిస‌రాల‌లో క్వాన్ కార్యాల‌యం ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఎన్.సి.బి ద‌ర్యాప్తు అనంత‌రం క్వాన్ లో లైంగిక వేధింపుల ఫ‌ర్వం బ‌య‌ట‌ప‌డింది. ద‌ర్యాప్తు సంస్థ క్వాన్ ప్ర‌తినిధుల‌ను విచారించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ర‌క‌ర‌కాల వివాదాల అనంత‌రం క్వాన్ ప్ర‌భ మ‌స‌క‌బారింది. ఇప్పుడు క్వాన్ మేనేజ్ మెంట్ తో స‌త్సంబంధాలున్న క‌థానాయిక‌లు వేరే సంస్థ‌ల వైపు మొగ్గు చూప‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆ మేర‌కు ప్ర‌ఖ్యాత బాలీవుడ్ మీడియా రాసిన క‌థ‌నం వేడెక్కిస్తోంది.

ప‌లువురు యువ‌క‌థానాయిక‌లు ఆర్టిస్టులు ఇప్ప‌టికే క్వాన్ ని ఇత‌ర సంస్థ‌ల‌ను వ‌దిలి క‌ర‌ణ్ కి చెందిన మేనేజ్ మెంట్ కంపెనీ DCAలో చేరుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. క‌ర‌ణ్ ఇప్పుడు ట్యాలెంట్ మేనేజ్ మెంట్ లోనూ బిగ్ గేమ్ ప్లేయ‌ర్ గా మార‌నున్నారు. అత‌డు ప‌రిచ‌యం చేసిన క‌థానాయిక‌లంతా ఇప్పుడు డీసీఏ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది క‌ర‌ణ్ కి అద‌నంగా కాసులు కురిపించ‌నుంది.

ప్ర‌ముఖ యువ‌క‌థానాయిక జాన్వీ కపూర్ మాతృక సంస్థ‌ను విడిచిపెట్టింద‌ని కరణ్ జోహార్ DCA లో చేరుతుంద‌ని తాజా క‌థ‌నంలో వెల్ల‌డైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మేనేజర్ రేష్మా శెట్టితో ఒక పెద్ద ఫాల్ అవుట్ (ఉత్థాన‌ప‌త‌నం) కరణ్ జోహార్ కొత్త సంస్థ డీసీఏ కి పెద్ద సాయ‌మ‌వుతోందంటూ స‌ద‌రు క‌థ‌నం ఉటంకించింది. ఏస్ ఫిల్మ్ మేకర్ కార్నర్ స్టోన్ తో పాటు తన సొంత టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజెన్సీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. దానికి ధర్మ కార్నర్ స్టోన్ ఏజెన్సీ (DCA) అని పేరు పెట్టారు. చాలా మంది ధర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో ప‌ని చేసే ప్రతిభావంతులు వారి గ‌త సంస్థ క్వాన్ మాతృకను వదిలి DCA లో చేరమని క‌ర‌ణ్ చెప్పినట్లు సమాచారం. అనన్య పాండే తన మునుపటి ఏజెన్సీ క్వాన్ టాలెంట్ మేనేజ్ మెంట్ ను త్వరలోనే వదిలేసి DCA బ్యాండ్ వాగన్ లో చేరుతోంద‌ని జాన్వీ కపూర్ కూడా దీనిని ఫాలో చేస్తోంద‌ని స‌ద‌రు ముంబై మీడియా క‌థ‌నంలో వెల్ల‌డించింది.

నిజానికి ధ‌ర్మ అధినేత కంటే ముందే సూప‌ర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా తన ఏజెన్సీ `యునైటెడ్ బీయింగ్ టాలెంట్`(యుబిటి) ను ప్రారంభించాడు. అయితే మ్యాట్రిక్స్ వ్యవస్థాపకురాలు రేష్మా శెట్టితో పోటీలో నిల‌దొక్కుకోవ‌డంలో త‌డ‌బ‌డ్డారు. భాయ్ ప్రణాళిక అతనికి అనుకూలంగా పని చేయలేదు. కానీ చివరికి కరణ్ గేమ్ ని మార్చార‌ని ఇప్పుడు యువ‌క‌థానాయిక‌లంతా డీసీఏ లో చేరుతున్నార‌ని స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది. ఇప్పుడు క‌ర‌ణ్ జోహార్ స‌న్నిహిత‌ పరిచయ‌స్తులు.. యువ‌క‌థానాయిక‌లు అంతే ఒకే తాటిపై డీసీఏలో చేరుతున్నారు. జాన్వీ ఇటీవల మాతృక మ్యాట్రిక్స్ కు వీడ్కోలు పలికింది. ఆమె తన సొంత మేనేజర్ ని DCA లోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జాన్వీ ఇప్పటికే మ్యాట్రిక్స్ కి దూరంగా ఉన్నారు. త్వరలోనే DCA లో చేరనుంది. ఆమె కజిన్ సోదరి షానయా కపూర్ ఇప్పటికే అదే టీమ్ ద్వారా పీఆర్ కొన‌సాగిస్తున్నారు.

ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ ఇప్ప‌టికే లాక్ అయి ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఇవ‌న్నీ మాతృక మ్యాట్రిక్స్ క్రింద కొనసాగుతాయి. మేనేజ‌ర్ల‌ పదవీకాలం పూర్తయ్యే క్ర‌మంలోనే DCA జాన్వీకి సంబంధించిన‌ పూర్తి నియంత్రణ పోస్ట్ ను తీసుకోవాల్సి ఉంటుంది.