Begin typing your search above and press return to search.
హీరోలే కథకులు.. టార్గెట్ హిట్టు సినిమా..!
By: Tupaki Desk | 12 Jan 2023 12:30 AM GMTఒక సినిమా చేయాలి అంటే నిర్మాతతో మొదలై దర్శకుడు ఫిక్స్ అయ్యి.. హీరో, హీరోయిన్ మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వీటన్నిటికన్నా ముందు సినిమాకు ఒక కథ రెడీ చేసుకోవాలి. ఈ కథ అయితే ఆడియన్స్ ని మెప్పిస్తుంది అన్న జడ్జ్ మెంట్ కు రావాలి. అలా ఒక కథ మీద హీరో నమ్మకం పెట్టుకుని సినిమా చేస్తాడు. అతను యువ హీరో అయినా, స్టార్ హీరో అయినా కథ బాగున్నప్పుడే సినిమా హిట్ అవుతుంది. అయితే ఇప్పుడు పంథా పూర్తిగా మారిపోయింది. ఎవరో రాసిన కథ మీద ఆధారపడటం ఎందుకని హీరోలే ఎంచక్కా కథలు రాసుకుంటున్నారు.
ముఖ్యంగా యువ హీరోల్లో ఈ పట్టుదల మరింత పెరిగింది. ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ కు యూత్ కు ఎలాంటి కథ కావాలని వారికి నచ్చేట్టుగా ఎలాంటి కథ రాసుకోవాలని హీరోలే తమ బుర్రకి పదును పెట్టేస్తున్నారు. ఇలా తమ కథలను తామే రాసుకుంటూ ఒక టీం వర్క్ చేస్తున్న హీరోలకు మంచి ఫలితాలు వస్తున్నాయి. వీరిలో మొదట చెప్పుకుంటే అడివి శేష్ వస్తాడు. మొదట్లో అతన్ని ఎవరు పట్టించుకోకపోయినా తన పట్టుదల వదలకుండా అలానే ప్రయత్నిస్తూ వచ్చాడు. ఫైనల్ గా ప్రేక్షకుల మెప్పు పొందాడు.
అడివి శేష్ తను చేసే ప్రతి సినిమా కథ తనే సిద్ధం చేసుకుంటాడు. అందుకే డబుల్ హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఇక ఈ లిస్ట్ లో డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఉన్నాడు. అతను కూడా డీజే టిల్లు మాత్రమే కాదు అంతకుముందు చేసిన కృష్ణ అండ్ హిస్ లీల సినిమాకు తనే కథ అందించాడు. డీజే టిల్లు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు చేస్తున్న టిల్లు స్క్వేర్ కి అతనే కథ అందించాడు.
ఇక వీరితో పాటుగా యువ హీరో కిరణ్ అబ్బవరం కూడా స్క్రిప్ట్ లో తన ఆలోచనలను షేర్ చేసుకుంటాడని తెలుస్తుంది. శ్రీ విష్ణు కూడా తన టీం తో కలిసి స్టోరీ డిస్కషన్స్ చేస్తుంటాడట. ఇలా యువ హీరోలంతా కథకులుగా మారి హిట్టు సినిమాను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ సినిమాలు వారి కెరీర్ గ్రోత్ కే కాదు పరిశ్రమ అభివృద్ధికి ఎంతో హెల్ప్ అవుతాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్న ఈ యువ హీరోలు వరుస సక్సెస్ లు అందుకోవాలని ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.