Begin typing your search above and press return to search.

సాప్ట్ టైటిల్స్ తో కుర్రాళ్లు కుమ్మేస్తున్నారే!

By:  Tupaki Desk   |   18 July 2022 7:04 AM GMT
సాప్ట్ టైటిల్స్ తో కుర్రాళ్లు కుమ్మేస్తున్నారే!
X
సినిమా తీయ‌డం ఒక ఎత్తైతే..ఆ సినిమాకి టైటిల్ నిర్ణ‌యించ‌డం మ‌రో ఎత్తు. సినిమా టైటిల్ విష‌యంలో ఎన్నో విష‌యాలో ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. హీరో ఇమేజ్...స్టోరీకి యాప్ట్ అవ్వ‌డం..క్యాచీగా ఉండ‌టం ఇలా మూడు అంశాలు టైటిల్ విష‌యంలో క‌చ్చితంగా ప‌రిగ‌ణ‌లో ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల విష‌యంలో ఆ నిబంధ‌న‌లు ద‌ర్శ‌కులు త‌ప్ప‌క‌ పాటించాల్సి ఉంటుంది.

హీరో ఒకే చేసిన త‌ర్వాత‌నే ఆ టైటిల్ అధికారికంగా ప్ర‌క‌టించేంది. అంత‌గా టైటిల్ పై హీరో ప్ర‌భావం ఉంటుంది. ఇక యంగ్ హీరోల సినిమాల టైటిల్స్ అయితే క‌థ‌ని టైటిల్లోనే చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. కంటెంట్ ఏంట‌న్న‌ది టైటిల్లోనే రివీల్ చేస్తుంటారు. కంటెంట్ బేస్డ్ క‌థ‌లు కావ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా చెప్పొచ్చు.

ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ యంగ్ హీరోలు మాత్రం అచ్చ తెలుగు టైటిల్స్ కి మంచి ప్రాధాన్య‌త ఇస్తున్న స‌న్నివేశం క‌నిపిస్తుంది. అందులో యంగ్ హీరో కిర‌ర‌ణ్ బ్బవ‌రం ముందు వ‌రుస‌లో క‌నిపిస్తున్నారు. కెరీర్ ఆరంభంలో 'రాజావారు రాణీవారు'..'స‌మ్మ‌త‌మే'..'ఎస్. ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం' సినిమాలో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నారు. హీరో జ‌నాల్లోకి వెళ్ల‌డానికి ఈ టైటిల్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి. క‌థ‌కి త‌గ్గ‌ట్టు టైటిల్ ఉండ‌టం.. క్యాచీగా ఉండ‌టంతోనే హీరో టైటిల్ ద‌గ్గ‌రే స‌గం స‌క్సెస్ అయ్యాడు.

ప్ర‌స్తుతం కిర‌ణ్ 'విన‌రోభాగ్యం విష్ణు క‌థ‌'..నేను మీకు బాగా కావాల్సిన వాడిని' లాంటి టైటిల్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ టైటిల్స్ జ‌నాల్లో దూసుకుపోతున్నాయి. ఇలా కిర‌ణ్ మొత్తం గ్రాఫ్‌ని ప‌రిశీలిస్తే టైటిల్స్ విష‌యంలో అత‌నొక స్ర్టాట‌జీ తో ముందుకు వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఫ‌లితాల సంగ‌తి పక్క‌నబెడితే టైటిల్స్ తో క్యూరియాసిటీ క‌ల‌గ‌చేస్తున్నారు.

అలాగే మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ కూడా తొలి నుంచి సాప్ట్ టైటిల్స్ నే వాడుతున్నారు. తొలి సినిమా 'ఉప్పెన‌'..అటుపై 'కొండ పొలం' రెండు క్యాచీ టైటిల్స్. ప్ర‌స్తుతం 'రంగ‌రంగ వైభ‌వంగా' అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇలా మొద‌టి నుంచి వైష్ణ‌వ్ ట్రెడీష‌న‌ల్ ట‌చ్ ఉన్న టైటిల్స్ తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షిస్తున్నాడు. ఇక సుధీర్ బాబు సైతం కొంత కాలంగా ఇదే ట్రెండ్ అనుస‌రిస్తున్నాడు.

'ఆనందోబ్ర‌హ్మ‌'..'స‌మ్మో హ‌నం'..'న‌న్ను దోచుకుంద‌వ‌టే'..'వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు'..'శ్రీదేవి సోడా సెంట‌ర్' వంటి స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్స్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ప్ర‌స్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'..'మామ మ‌చ్చేసిందిరా' వంటి టైటిల్స్ తో సినిమాలు చేస్తున్నారు.

మ‌రో యంగ్ హీరో నాగ‌శౌర్య 'కృష్ణ వ్రింద విహారి' అనే సాప్ట్ టైటిల్ తో రొమాంటిక్ ల‌వ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. ఇక బెల్లంకొండ సురేష్ వార‌సుడిగా ఎంట్రీ ఇస్తున్న గ‌ణేష్ 'స్వాతిముత్యం' అంటూ ఏకంగా క‌మ‌ల్ హాస‌న్ స‌క్సెస్ టైటిల్ తోనే ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు.